ENGLISH

'స్వచ్ఛ సేవ'కు 'బాహుబలి' మద్దతిచ్చాడు

29 September 2017-18:08 PM

'బాహుబలి' సినిమాతో ప్రబాస్‌ టాలీవుడ్‌ స్థాయి నుండి నేషనల్‌ స్టార్‌ అయ్యాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన 'స్వచ్ఛ భారత్‌' క్యాంపెయిన్‌లో పాల్గొనాలని సెలబ్రిటీస్‌కి పిలుపునిచ్చారు. అందులో భాగంగా పలువురు సెలబ్రిటీస్‌కి మోడీ నుండి ఆహ్వానాలు కూడా అందాయని సమాచారమ్‌. ఈ 'స్వచ్ఛ సేవా' కార్యక్రమానికి హీరో ప్రబాస్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఈ మహత్కార్యానికి తాను మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు స్వచ్చ సేవా కార్యక్రమం క్యాంపెయిన్‌లో తానూ భాగస్వామ్యం అవుతాననీ ప్రబాస్‌ అన్నారు. ఫేస్‌బుక్‌లో ఈ సందర్భంగా అభిమానులకు ఓ ప్రకటన కూడా చేశారు ప్రబాస్‌. 'ప్రియమైన నా అభిమానులందరికీ.. పరిశుభ్రతకు ఎంతో విలువిచ్చిన మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో తానూ భాగస్వామిని కావాలని అనుకుంటున్నాను. నా దేశాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం భారతదేశ పౌరుడిగా నా బాధ్యతే కాదు అలవాటు కూడా. నాలాగే మీరు కూడా ఆలోచించి దేశం శుభ్రంగా ఉండేలా మీ వంతు కృషి చేస్తారనీ ఆశిస్తున్నాను. అప్పుడే, ఇప్పుడున్న దానికంటే మన దేశం మరింత అందంగా తయారవుతుంది. జై హింద్‌!' అని ప్రబాస్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. 'బాహుబబలి'తో యూనివర్సల్‌ స్టార్‌ అనిపించుకున్న ప్రబాస్‌ పిలిస్తే అభిమానులు పాల్గొనకుండా ఎందుకుంటారు. ప్రస్తుతం ప్రబాస్‌ 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: మహానుభావుడు రివ్యూ & రేటింగ్స్