ENGLISH

యూవీకి బ్రేక్ ఇచ్చిన ప్ర‌భాస్‌

28 January 2022-12:43 PM

ప్ర‌భాస్ కి అత్యంత ప్రీతి పాత్ర‌మైన సంస్థ యూవీ క్రియేష‌న్స్‌. ఓ ర‌కంగా యూవీలో ప్ర‌భాస్ వాటా ఉంది. మిర్చి, సాహో, రాధే శ్యామ్ చిత్రాలు యూవీ బ్యాన‌ర్‌లోనే రూపొందించారు. స్పిరిట్ లో కూడా యూవీ వాటా ఉంది. ప్ర‌భాస్ ప్ర‌తి సినిమాలోనూ యూవీకి, యూవీ ప్ర‌తి సినిమాలోనూ ప్ర‌భాస్‌కీ వాటా ఉంద‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. అయితే... ఇప్పుడు యూవీ కి కొంత కాలం బ్రేక్ ఇవ్వాల‌ని ప్ర‌భాస్ నిర్ణ‌యించుకున్నాడ‌న్న‌ది టాక్‌. ప్ర‌భాస్ రాబోవు సినిమాలు కొన్నింటిలో యూవీకి ఎలాంటి వాటా లేదు. ఇది ప్ర‌భాస్ కావాల‌ని తీసుకున్న నిర్ణ‌యం అని స‌మాచారం.

 

ప్రభాస్ - మారుతి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి డి.వి.వి దాన‌య్య నిర్మాత‌. ఈ సినిమాలో యూవీ కి ఎలాంటి వాటా లేద‌ట‌. ఇక రాబోయే సినిమాల్లోనూ యూవీ ప్ర‌మేయం ఏమీ ఉండ‌బోద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించ‌బోతున్నాడ‌ని, అందుకే యూవీకి బ్రేక్ ఇస్తున్నాడ‌న్న‌ది ఇండ్రస్ట్రీ వ‌ర్గాల టాక్‌. దాదాపు ప్ర‌తీ హీరోకీ ఓ నిర్మాణ సంస్థ ఉంది. అందుకే ప్ర‌భాస్ కూడా ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నాడ‌ని స‌మాచారం.

ALSO READ: స‌మంత ఒత్తిడి మేర‌కే... నాగ్ ట్వీట్‌?