ENGLISH

పెళ్లికి తొంద‌ర‌ప‌డింది అందుకే!

16 June 2021-15:34 PM

అత్తారింటికి దారేదితో బాపు బొమ్మ గా మారిపోయింది ప్ర‌ణీత‌. అయితే... ఆ హిట్ ని తాను పెద్ద‌గా క్యాష్ చేసుకోలేక‌పోయింది. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు రాక‌పోవ‌డం, యువ హీరోలు ప్ర‌నీత‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. త‌న కెరీర్ కి పుల్ స్టాప్ ప‌డిపోయింది. ఈ ద‌శ‌లోనే... పెళ్లి కూడా చేసేసుకుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలామంది సినీ సెల‌బ్రెటీలు పెళ్లిపీట‌లెక్కారు. అందుతో ప్రణీత కూడా ఉంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ప్ర‌ణీత‌. సోష‌ల్ మీడియాలో ఫొటోలు వ‌స్తే త‌ప్ప‌.. ప్రణీత పెళ్లి అయిపోయిన‌ట్టు తెలీలేదు. దాంతో ప్ర‌ణీత ఇంత ర‌స‌హ్యంగా పెళ్లి ఎందుకు చేసుకుంది? అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

 

దీనిపై ప్ర‌ణీత క్లారిటీ ఇచ్చింది. క‌రోనా వ‌ల్ల పెళ్లి సింపుల్ గాచేసుకోవాల్సివ‌చ్చింద‌ని, మంచి ముహూర్తాలు లేక‌పోవ‌డం, ఆషాడం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో... అప్ప‌టిక‌ప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నామ‌ని, ఎవ‌రికీ చెప్పే అవ‌కాశమే లేకుండా పోయింద‌ని చెప్పుకొచ్చింది. ``పెళ్లి నిజంగానే గ్రాండ్ గా చేసుకుందామ‌నుకున్నాం. కానీ క‌రోనా వ‌ల్ల వీలు కాలేదు. ద‌గ్గ‌ర్లో మంచి ముహూర్తాలు లేవ‌ని చెప్ప‌డంతో, అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నాం`` అని చెప్పింది ప్ర‌ణీత‌.

ALSO READ: ప‌వ‌న్‌కి మంత్రి ప‌ద‌వి... ఢిల్లీలో ఊహాగానాలు