ENGLISH

మ‌రో అవార్డు ఖాయ‌మేనా..?

04 June 2020-10:00 AM

క‌థానాయిక‌గా ఉన్న‌ప్పుడు గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు కేరాఫ్ గా నిలిచింది ప్రియ‌మ‌ణి. అయితే... ఆమెలో ఆ యాంగిల్ మాత్ర‌మే కాదు. మ‌రో యాంగిల్ కూడా ఉంద‌ని ప‌రుత్తివీర‌న్ సినిమా నిరూపించింది. ఈ సినిమాతోనే ప్రియ‌మ‌ణికి జాతీయ అవార్డు ద‌క్కింది. అప్ప‌టి నుంచీ కాస్త వైవిధ్యం ఉన్న పాత్ర‌ల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది ప్రియ‌మ‌ణి.

 

ఇప్పుడు విరాట‌ప‌ర్వంలో న‌టిస్తోంది. రానా, సాయి ప‌ల్ల‌వి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న చిత్ర‌మిది. వేణు ఉడుగుల ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో కామ్రేడ్ భార‌త‌క్క‌గా క‌నిపించ‌బోతోంది ప్రియ‌మ‌ణి. న‌క్స‌ల్ ఉద్య‌మ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఫ్రెంచ్ విప్ల‌పంలో విద్యార్థుల పాత్ర ఎంత కీల‌క‌మో, విరాట‌ప‌ర్వంలో కామ్రేడ్ భార‌త‌క్క పాత్ర అంత కీల‌కమ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈరోజు ప్రియ‌మ‌ణి పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రియ‌మ‌ణి లుక్ విడుద‌ల చేశారు. చూస్తుంటే మ‌రో అవార్డు కొట్టేట్టే క‌నిపిస్తోంది.

ALSO READ: క్రిష్‌ని ప‌క్క‌న పెట్టి.. హ‌రీష్ శంక‌ర్ తో..?