ENGLISH

మహేష్ సినిమాలో ప్రియాంకా చోప్రా ?

17 December 2024-12:41 PM

మహేష్, రాజమౌళి కాంబో మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫాన్స్ ఎదురుచూస్తు న్నారు. కానీ ఇంకా జక్కన్న చెక్కుతూనే ఉన్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది అని సమాచారం. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో వర్క్ షాప్ నడుస్తోంది అని టాక్. ఈ మధ్య జక్కన్న కెన్యా అడవుల్లో విహరిస్తూ లొకేషన్స్ సెర్చింగ్ అని హింట్ ఇచ్చారు. అయినా ఇప్పటికీ మూవీ పూజా కార్య క్రమాలు జరుపుకోలేదు. మార్చ్ లో షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తోంది.

నటీ నటుల ఎంపిక ప్రక్రియ కూడా జరగలేదు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ మహేష్ పక్కన నటించే హీరోయిన్ ఎవరో తెలుసా? మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ప్రియాంక చోప్రా అని టాక్. నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక ప్రజంట్ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఇప్పడు జక్కన్న మహేష్ కోసం చోప్రాని సంప్రదించారని తెలుస్తోంది. ఈ మధ్య ప్రియాంక బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించటం లేదు. మరి మహేష్ సినిమాకి ఒప్పుకుంటుందో లేదో అని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. జక్కన్న కి దేశ విదేశాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా అయినా చోప్రా గర్ల్ ఓకే చెప్తుంది అని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.

ఇదివరకు కూడా టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా ప్రియాంక తిరస్కరించింది. ఇప్పడు మహేష్ పక్కన నటించనుంది. SSMB29 పాన్ వరల్డ్ ప్రాజెక్ట్, హీరోయిన్ గా ప్రియాంక అయితే హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది అని జక్కన్న ప్లాన్. ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లో నటించింది. పైగా అమెరికన్ కోడలు సో ఓవర్సీస్ లో మరిన్ని అంచనాలు పెరిగే ఛాన్స్ ఉందని మేకర్స్ భావన.