ENGLISH

వాళ్లెవ‌రూ కాదు... 'మ‌హా' దొరికేసింది!

19 September 2020-15:00 PM

శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌బోతున్న చిత్రం `మ‌హా స‌ముద్రం`. సిద్దార్థ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కుడు. మ‌హా అనే అమ్మాయి క‌థ ఇది. విశాఖ నేప‌థ్యంలో సాగుతుంది. మ‌హా పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. స‌మంత‌, సాయి ప‌ల్ల‌వి, అతిథిరావు హైద‌రీ.. ఇలా చాలామంది క‌థానాయిక‌ల పేర్లు చ‌ర్చించారు. చివ‌రికి వీళ్లెవ‌రూ కాకుండానే మ‌హా పాత్ర దొరికేసింది.

 

ప్రియాంకా మోహ‌న్ ని మ‌హా పాత్ర కోసం సెట్ చేశార‌ని తెలుస్తోంది. గ్యాంగ్ లీడ‌ర్ లో నాని స‌ర‌సన క‌థానాయిక‌గా న‌టించినంది ప్రియాంక‌. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. కానీ ప్రియాంక లుక్స్ మాత్రం జ‌నాల‌కు న‌చ్చింది. అందుకే ఆమెనే క‌థానాయిక‌గా సెట్ చేశార‌ని టాక్. సాయి ప‌ల్ల‌వి, స‌మంత‌.. వీళ్ల కాల్షీట్లు అందుబాటులో లేక‌పోవ‌డం కూడా... ప్రియాంక వైపు చూడ్డానికి కార‌ణ‌మైంద‌ని టాక్‌.అయితే ప్రియాంక ఎంపిక‌పై చిత్ర‌బృందం అధికారికంగా స్పందించాల్సివుంది.

ALSO READ: Priyanka Mohan Latest Photoshoot