ENGLISH

ప్రాజెక్ట్ 'కె'కీ... సూర్య సినిమాకీ సంబంధం ఏమిటి?

23 March 2022-16:11 PM

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో పాన్ ఇండియా సినిమా `ప్రాజెక్ట్ కె`. నాగ అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. `ప్రాజెక్ట్ కె` గురించి వివ‌రాలేవీ చిత్ర‌బృందం ఇప్ప‌టికి వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు. ఇదో సైన్స్ ఫిక్ష‌న్ అని మాత్రం తెలుస్తోంది. టైమ్ మిష‌న్‌కి సంబంధించిన క‌థ ఇద‌ని, కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో మ‌న‌కు చాలా క‌థ‌లొచ్చాయి. అందులో ఆదిత్య 369 ఒక‌టి. ఈత‌రంలో అలాంటి క‌థే... 24. సూర్య న‌టించిన ఈ చిత్రం ఓ మోస్త‌రు విజ‌యాన్ని సాధించింది. ప్ర‌భాస్ న‌టిస్తున్న `ప్రాజెక్ట్ కె` క‌థ‌కూ, `24`కీ ద‌గ్గ‌ర సంబంధం ఉంద‌ని స‌మాచారం. `24`లో హీరోకి ఓ వాచ్ దొరుకుతుంది. అందులో త‌న‌కు కావ‌ల్సిన‌ట్టు కాలాన్ని ముందుకీ, వెన‌క్కీ జ‌రుపుతుంటాడు. స‌రిగ్గా `ప్రాజెక్ట్ కె` కాన్సెప్ట్ కూడా ఇదే అని తెలుస్తోంది.కావ‌ల్సిన‌ప్పుడుల్లా భూత‌, భ‌విష్య‌త్తు కాలాల్లోకి వెళ్ల‌డ‌మే.. ఈ సినిమా ఇతివృత్తం అని స‌మాచారం. మ‌రి దాన్ని ఏ స్థాయిలో తీస్తున్నారో, క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ ఎక్క‌డ పుడుతుందో? ఈ క‌థ‌లో వ‌చ్చే మ‌లుపులేమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

ALSO READ: ఆ వివాద‌స్ప‌ద చిత్రాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన వ‌ర్మ‌