ENGLISH

Bandla Ganesh: బండ్ల కామెంట్స్ ఎఫెక్ట్‌: ఆకాష్ తో పూరి సినిమా?

30 June 2022-12:49 PM

చోర్ బ‌జార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గ‌ణేష్ రెచ్చిపోయి చేసిన కామెంట్లు టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. పూరి త‌న కుటుంబాన్ని వ‌దిలేశాడ‌ని, ఆకాష్‌ని పట్టించుకోవ‌డం లేద‌ని, డైలాగ్ చెప్ప‌డం రాని హీరోల్ని పూరి స్టార్ల‌ని చేసి, త‌న కొడుకుని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. బండ్ల ఘాటుగా కామెంట్లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే దీనిపై.. పూరి ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు విప్పలేదు. డైరెక్ట్ గా ఎలాంటి కామెంటూ చేయ‌లేదు. అయితే... తెర వెనుక మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నాడ‌ని టాక్‌.

 

ఆకాష్ పూరితో.. పూరి ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకొన్నాడ‌ని టాక్‌. పూరి ద‌గ్గ‌ర క‌థ‌ల‌కు కొర‌త లేదు. త‌న ద‌గ్గ‌రున్న క‌థ‌ల్లో ది బెస్ట్ క‌థ ఎంచుకొని, ఆకాష్ తో చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అయితే ద‌ర్శ‌క‌త్వం తాను వ‌హిస్తాడా, త‌న శిష్యుల‌కు అప్ప‌జెబుతాడా? అనేది చూడాలి. ఈ సినిమాకి డెరెక్ట‌ర్ ఎవ‌రైనా స‌రే, సినిమా మొత్తం త‌న అండ‌ర్‌లో జ‌రిగేలా.. ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

 

తాజాగా విడుద‌లైన `చోర్ బ‌జార్‌` ఫ్లాప్ అయ్యింది. దాంతో.. పూరి ఇప్పుడు రంగంలోకి దిగ‌క త‌ప్ప‌డం లేదు. ఈసారి ఆకాష్‌కి సాలీడ్ హిట్ ప‌డేలా పూరి అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నాడ‌ని టాక్.

ALSO READ: ఆకాష్ పూరి ఆలోచించాలి మరి !