ENGLISH

పూరి.. ఈసారి భారీగా సెట్ చేశాడుగా!

15 October 2020-12:30 PM

`ఇస్మార్ట్ శంక‌ర్‌` త‌ర‌వాత‌.. పూరి ఆలోచ‌నా విధానం పూర్తిగా మారిపోయింది. ఈసారి ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓసినిమా చేస్తున్నాడు పూరి. ఇది పాన్ ఇండియా సినిమా. దీని త‌ర‌వాత‌.. కూడా అదే స్థాయిలో మ‌రో భారీ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి కేజీఎఫ్ హీరో య‌ష్‌తో పూరి ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో పూరి కొన్ని క‌థ‌లు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ఒక‌టి య‌ష్‌కి బాగా సూట‌వుతుంద‌ని పూరి భావిస్తున్నార్ట‌. త్వ‌ర‌లోనే.. య‌ష్ ని క‌లిసి క‌థ చెప్ప‌డానికి రెడీ అవుతున్నాడు పూరి. య‌ష్ కి కూడా పూరి అంటే ఇష్టం అని తెలుస్తోంది. ఓ తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేయాలిన య‌ష్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. అందుకే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా అనిపిస్తోంది. విజ‌య్ సినిమా గ‌నుక హిట్ట‌యి, పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంటే.. య‌ష్ కూడా ఓకే చెప్పేస్తాడు.

ALSO READ: చిరు చెల్లెలి కోసం పోటీ