ENGLISH

అఖిల్ తో పూరి సినిమా వర్కౌట్ అయ్యేనా?

17 October 2024-11:51 AM

పూరి జగన్నాథ్ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయాడు. టెంపర్ తరవాత పూరికి సరైన హిట్ పడలేదు. విజయ్ దేవరకొండతో భారీ అంచనాలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా  'లైగర్' తెరకెక్కించారు. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలచింది. పాన్ ఇండియా దర్శకుడిగా పూరి సత్తా చాటలేకపోయాడు. దీనితో మళ్ళీ తనకి కలిసి వచ్చిన రామ్ ని నమ్ముకుని 'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరెకెక్కించారు. కానీ ఇది కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు పూరి వర్క్ చేయాలన్నా ఛాన్స్ ఇచ్చే నాధుడే లేడు. పూరీని ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితిలేదు. లైగర్ తరవాత 'జనగణమన' అనే సినిమా విజయ్ తో చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. కానీ లైగర్ డిజాస్టర్ కావటంతో విజయ్ వెనకడుగు వేశారు. 


ఒకప్పుడు స్టార్ హీరోలతో వర్క్ చేసిన పూరి జగన్నాథ్, ఇప్పడు చిన్న హీరోల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. ఆ మధ్య టిల్లు గాడికి కథ చెప్పగా, సిద్దు కూడా పూరికి నో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సారి ఎలా అయిన గ్రాండ్  కమ్ బ్యాక్ ఇవ్వాలని పూరి గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడట. తనలాగే హిట్ కోసం ఎదురుచూస్తున్న  అక్కినేని అఖిల్ పై పూరి ద్రుష్టి పెట్టారట. అఖిల్ కోసం పూరి ఒక కథ రాసుకున్నాడని, ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. పూరి, నాగ్ కాంబోలో వచ్చిన శివమణి మూవీ బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో నాగ్ కూడా పూరికి ఓటు వేయొచ్చని ఆశగా ఉన్నాడట. 


ఏజెంట్ మూవీ తరవాత అఖిల్ నుంచి ఇంకో సినిమా రాలేదు. ఓ మంచి హిట్ కోసం అఖిల్ ఆచి తూచి కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇలాంటి టైంలో అఖిల్ పూరీని నమ్మటమేంటని విమర్శలు వస్తున్నాయి. అఖిల్ కంటే వెనక వచ్చినవారు, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు కూడా సక్సెస్ అవుతుంటే అన్నీ ఉండి అఖిల్ ఇలా వెనకపడి పోయాడని ఫాన్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు పూరి దర్శకత్వంలో సినిమా చేయాలనుకోవటం కూడా రిస్క్ అని కామెంట్స్ చేస్తున్నారు.