ENGLISH

పుష్ష పాట ముందే ఎలా లీకైంద‌బ్బా?

13 August 2021-10:27 AM

లీకుల సీజ‌న్ న‌డుస్తోందిప్పుడు. `స‌ర్కారు వారి పాట‌` టీజ‌ర్‌... అఫీషియ‌ల్ గా రిలీజ్ కాకుండా ముందే లీకైపోయింది. ఇప్పుడు `పుష్ష‌` వంతు వ‌చ్చింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష‌`. ఈ సినిమాలోని తొలి పాట‌ని 13... ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేమ‌యాల‌నుకుంది చిత్ర‌బృందం. అయితే అనూహ్యంగా.. ఒక రోజు ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దాంతో చిత్ర‌బృందం షాక్ కి గురైంది. `దాక్కో దాక్కో మేక, పులొచ్చి కొరుకుతుంది పీక‌` అంటూ సాగే పాట ఇది. ఆహార చ‌క్రం నేప‌థ్యంలో పాట సాగుతుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ పాడిన పాట ఇది.

 

అయితే ఇది డ‌మ్మీ లిరిక్స్ తో సాగే పాట అని ఆ త‌ర‌వాత అర్థ‌మైంది. ఏదేమైనా.. ఆ ట్యూన్ బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం చిత్ర‌బృందాన్ని ఇబ్బంది పెట్టే అంశ‌మే. త‌మ టీమ్ లోనే ఒక‌రు కావాల‌ని ఈ పాట‌ని రిలీజ్ చేశార‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆచార్య‌, అఖండ‌, ఆర్‌.ఆర్‌.ఆర్ ల‌కు సంబంధించిన అప్ డేట్లు ఇచ్చేట‌ప్పుడు చిత్ర‌బృందం చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వహ‌రించాల్సిన అవ‌స‌రాన్ని ఈ ఉదంతాలు గుర్తు చేస్తున్నాయి. అఫీషియ‌ల్ గా రిలీజ్ చేయ‌కుండానే, ఇలా లీకుల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే.. ఇక మ‌జా ఏముంటుంది?

ALSO READ: Pushpa Dakko Dakko Meka Song