ENGLISH

రాశీఖన్నా మ్యారేజ్‌ బ్యూరో

15 September 2017-18:51 PM

జై పాత్రలో ఎన్టీఆర్‌ పరకాయ ప్రవేశం చేసేశాడు. పాత్రకి తగ్గట్టుగా మారిపోవడం చాలా కష్టం. అది ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకున్నానని ఎన్టీఆర్‌ని పొగిడేస్తూ చెబుతోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఈ ముద్దుగుమ్మ 'జై లవకుశ'లో ఎన్టీఆర్‌తో జత కడుతోంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ పేరు ప్రియ. మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకురాలిగా నటిస్తోంది. ఎన్టీఆర్‌తో జత కట్టడం చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులతో తన సంతోషాన్ని షేర్‌ చేసుకుంది. ఎన్టీఆర్‌ మంచి డాన్సర్‌. ఆయనతో పోటీ పడి డాన్స్‌ చేయడం చాలా కష్టం. అయినా కానీ కష్టపడి ట్రై చేశాను. గతంలో రామ్‌, సాయి ధరమ్‌తేజ్‌లతో కలిసి నటించిన అనుభవం ఉన్న కారణంగా కొంచెం కష్టమైనా ఎన్టీఆర్‌ పక్కన డాన్సులేయగలిగాను అని చెబుతోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. రాశీ పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుందట. ఇంతవరకూ గ్లామర్‌ రోల్స్‌లోనే నటించిన ఈ భామ ఈ సినిమాతో తన పర్‌ఫామెన్స్‌ని చూపిస్తానంటోంది. దర్శకుడు బాబీ తన క్యారెక్టర్‌ని బాగా డిజైన్‌ చేశాడని చెబుతోంది. ఈ నెల 21న 'జై లవకుశ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాశీఖన్నాతో పాటు నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జై పాత్ర గురించి రాశీఖన్నా పొగడ్తల వర్షం కురిపించేస్తోంది. కాగా ఈ ముద్దుగుమ్మ తదుపరి వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తోంది. నారా రోహిత్‌తో 'బాలకృష్ణుడు' సినిమాలోనూ కనిపించనుంది.

ALSO READ: ఉంగరాల రాంబాబు మూవీ రివ్యూ & రేటింగ్స్