ENGLISH

ప్ర‌భాస్‌తో... సూప‌ర్ ఛాన్సులే!!

14 June 2021-13:00 PM

రాశీఖ‌న్నా ప‌రిస్థితి అటూ ఇటూ కాకుండా మ‌ధ్య‌స్థ ద‌శ‌లో ఆగిపోయింది. అటు టాప్ హీరోల‌తో చేయ‌లేదు. ఇటు కొత్త వాళ్ల‌తో స‌ర్దుక‌పోలేదు. మీడియం రేంజు హీరోల‌తో బండి లాగించేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది. అయినా.. అవ‌కాశాల‌కేం కొద‌వ లేదు. టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉండే క‌థానాయిక‌ల్లో తానూ ఒక‌రు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ తన కెరీర్‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని ఓ సూప‌ర్ ఛాన్స్ ద‌క్కించుకుంద‌ని టాలీవుడ్ స‌మాచారం.

 

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా వైజ‌యంతీ మూవీస్ ఓ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తోంది.నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో దీపికా ప‌దుకొణెని క‌థానాయిక‌గా ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మ‌రో క‌థానాయిక‌గా... రాశీఖ‌న్నాని ఎంచుకున్నార్ట‌. టాప్ మోస్ట్ హీరోతో రాశీ జ‌త క‌ట్ట‌డం ఇదే తొలిసారి. సో.. ఇది త‌న కెరీర్‌లో మ‌ర్చిపోలేని సూప‌ర్ ఛాన్స్‌. ఈ సినిమాలో రాశీ పాత్ర క్లిక్ అయితే గ‌నుక‌... భ‌విష్య‌త్తులో మ‌రింత మంది టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు ద‌క్కించుకోగ‌ల‌దు. మ‌రి.. రాశీ ఈ అవ‌కాశాన్ని ఎలా ఒడిసిప‌ట్టుకుంటుందో చూడాలి.

ALSO READ: ప‌వ‌న్‌తో పోటీనా.. చైతూ నీకెందుక‌మ్మా...?