ENGLISH

లాజిక్కులు లాగుతున్న రాశీఖ‌న్నా

06 April 2021-17:14 PM

చాలామంది విధిని న‌మ్ముతారు. సినిమావాళ్ల‌యితే మ‌రీనూ. `ఏదైనా రాసి పెట్టి ఉండాలండీ` అంటారు. రాశీఖ‌న్నాదీ అదే తంతు. `ఏం రాసి పెట్టి ఉంటే అదే జ‌రుగుతుంది` అని వేదాంతం మాట్లాడుతుంటుంది అప్పుడ‌ప్పుడూ. క‌థానాయిక‌గా త‌న‌కు వెరైటీ పాత్ర‌లు చేయాల‌ని ఉంటుంద‌ని, కానీ... అలాంటి పాత్ర‌లు ద‌క్క‌డానికి అదృష్టం ఉండాల‌ని, ద‌ర్శ‌కులు `రాసి పెట్టి ఉంటేనే` త‌న‌కు గొప్ప అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అంటోంది.

 

``క‌థానాయికగా మా కెరీర్ మా చేతుల్లో లేదు. ద‌ర్శ‌కుల రాత‌ల్లో ఉంది. వాళ్లు గొప్ప పాత్ర‌లు సృష్టించ‌క‌పోతే మేం మాత్రం ఏం చేసేది? వంద సినిమాలొస్తే.. అందులో ఒక‌టో రెండో సినిమాల్లో క‌థానాయిక పాత్ర‌లకు మంచి పేరొస్తుంది. అలాంటి పాత్ర‌ల కోసం ఎదురు చూడ‌డం త‌ప్ప మేం సృష్టించుకోలేం క‌దా`` అని లాజిక్కులు మాట్లాడుతోంది.

ALSO READ: Raashi Khanna Latest Photoshoot