ENGLISH

నాన్న నుంచి నేర్చుకున్న న‌వ్వులు

26 April 2021-14:00 PM

కామెడీ పండించ‌డం చాలా క‌ష్టం. మ‌న హీరోలు ఈ క‌ష్టాన్ని ఈజీగానే దాటేస్తుంటారు. అగ్ర హీరోలంద‌రి కామెడీ టైమింగ్ బాగుంటుంది. కానీ.. హీరోయిన్ల విష‌యానికి వ‌స్తేనే.. కాస్త అటూ ఇటుగా ఉంటోంది. క‌థానాయిక‌ల్లో కామెడీ చేసేవాళ్లు చాలా త‌క్కువ‌. అయితే రాశీఖ‌న్నా కి మాత్రం అది అల‌వాటైపోయింది. బెల్లం శ్రీ‌దేవి నుంచి, ఏంజెల్ ఆర్నా వ‌రకూ.. త‌న‌కు న‌వ్వించే అవ‌కాశం వ‌చ్చే ప్ర‌తీసారీ.. స‌క్సెస్ అయ్యింది. కామెడీ ట‌చ్ ఎలా దొరికింది అని అడిగితే.. `నా కామెడీ అంతా డాడీ నుంచే వ‌చ్చింది` అంటోంది.

 

''నాన్న భ‌లే స‌ర‌దా మ‌నిషి. ఎప్పుడూ న‌వ్విస్తూ ఉంటారు. ఆయ‌న సెన్సాఫ్ హ్యూమ‌ర్ నాకూ వ‌చ్చింది. సెట్లోనూ అదే ఫాలో అవుతున్నా'' అంది. ఇప్పుడు గోపీచంద్ తో చేస్తున్న `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`లోనూ రాశీ న‌వ్వులు పంచ‌బోతోంద‌ట‌. ''క‌థానాయిక‌లుగా మా పాత్ర‌ల‌న్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అంద‌రూ అందంగానే ఉంటారు. వాళ్ల‌కు కామెడీ టైమింగ్ దొర‌క‌డం ఓ వ‌రం. నా అదృష్టం కొద్దీ.. కాస్తో కూస్తో కామెడీ టైమింగ్ ని ప‌ట్టుకోగ‌లిగా'' అని చెప్పుకొచ్చింది.

ALSO READ: Raashi Khanna Latest Photoshoot