ENGLISH

మెగా ప్రిన్స్‌తో రాశీ కూల్‌ సెల్ఫీ

02 October 2017-18:08 PM

ముద్దుగుమ్మ రాశీఖన్నా ఇటీవలే 'జై లవకుశ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతవరకూ యంగ్‌ హీరోస్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసిన ఈ బ్యూటీకి స్టార్‌ హీరో ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వచ్చింది ఈ సినిమాతో. ఈ సినిమా విజయంతో అమ్మడి స్టార్‌ మారిపోయిందంతే. తాజాగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో రాశీఖన్నా ఓ సినిమాలో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం బిజీగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఫోటో నెట్‌లో హాల్‌చల్‌ చేస్తోంది. షూటింగ్‌ విదేశాల్లో జరుగుతోంది. షూటింగ్‌ స్పార్ట్‌లో వరుణ్‌ ఫోన్‌లో ఏదో చేస్తోంటే, వరుణ్‌కి తెలియకండా, ముద్దుగుమ్మ రాశీఖన్నా ఓ సెల్ఫీ క్లిక్‌మనిపించింది. అంతటితో ఆగలేదు ఈ భామ, ఈ సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి నా వెనుక ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం? అంటూ పజిల్‌ విసిరింది ఫ్యాన్స్‌కి. నెటిజన్లు ఈ సెల్ఫీని చూసి బోలెడన్ని ఫన్నీ కామెంట్స్‌ పంపించారు. ఇటీవలే వరుణ్‌ నటించిన 'ఫిదా' మూవీ సూపర్‌ సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో భానుమతిగా సాయి పల్లవి, వరుణ్‌ క్యారెక్టర్‌లో వరుణ్‌ తేజ్‌ నటించారనడం కన్నా జీవించారంటే బావుంటుంది. లవ్‌లీ పెయిర్‌గా ఈ ఇద్దరి జంట అంతగా ఆకట్టుకుంది మరి. దాంతో అది దృష్టిలో పెట్టుకుని నెటిజన్లు 'వరుణ్‌ ఇంకా భానుమతిని మర్చిపోలేకపోతున్నాడు కాబోలు..' అంటూ స్వీట్‌ స్వీట్‌ పోస్ట్‌లు చేశారు. రాశీఖన్నా అల్లరి పిల్లే. మరీ ఇంత అల్లరి పిల్ల అనుకోలేదు సుమీ!

ALSO READ: పవన్ టార్గెట్ 175 అట?!