ENGLISH

రాధే శ్యామ్.... కొత్త ట్రైల‌ర్ రెడీ!

26 February 2022-10:17 AM

మార్చి 11న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది రాధేశ్యామ్. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. అప్ప‌ట్లో ప్ర‌మోష‌న్లు భారీగానే చేశారు. కానీ.. స‌డ‌న్ గా వాయిదా ప‌డింది. సంక్రాంతి టైమ్ లోనే థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసేశారు. అయితే ఇప్పుడు మరో ట్రైల‌ర్‌ని వ‌ద‌ల‌బోతున్నారు. భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ వ‌చ్చిన‌, రెండు రోజుల‌కే మ‌ళ్లీ కొత్త ట్రైల‌ర్ ని వ‌దిలారు. ఫ‌స్ట్ ట్రైల‌ర్ కంటే, రెండో ట్రైల‌ర్ బాగుంద‌న్న టాక్ వ‌చ్చింది. `రాధే శ్యామ్‌` ట్రైల‌ర్ విష‌యంలోనూ ఇలానే మిక్డ్స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రెండో ట్రైల‌ర్ బాగుంటుందేమో చూడాలి.

 

ప్ర‌భాస్ - పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. రాధాకృష్ణ ద‌ర్శ‌కుడు.యూవీ క్రియేష‌న్స్ దాదాపు రూ.300 కోట్ల‌తో తెరకెక్కించింది. బాలీవుడ్ లో భారీ గా రిలీజ్ చేయ‌నుంది చిత్ర‌బృందం. హిందీ వెర్ష‌న్‌కి అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో మహేష్ బాబు, లేదా రామ్ చ‌ర‌ణ్‌, లేదంటే రాజ‌మౌళి వాయిస్ ఓవ‌ర్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ALSO READ: 'భీమ్లా నాయక్' మూవీ రివ్యూ & రేటింగ్!