ENGLISH

'రాధేశ్యామ్' కి కూడా రెండు రిలీజ్ డేట్లు

01 February 2022-10:32 AM

టాలీవుడ్‌లో రిలీజుల హంగామా మొద‌లైపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల డేట్లు ప్ర‌క‌టించేస్తున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌, ఆచార్య‌, భీమ్లా నాయక్‌, ఎఫ్ 3, స‌ర్కారు వారి పాట‌.. ఇలా పెద్ద సినిమాల‌న్నీ రిలీజు డేట్ల జెండా ఎగ‌రేశాయి. అయితే రాధే శ్యామ్ రిలీజ్ డేట్ మాత్రం ఇంత వ‌రకూ ప్ర‌క‌టించ‌లేదు. ఆర్‌.ఆర్‌.ఆర్‌లానే.. రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా సినిమానే. ప‌లుమార్లు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించినా, క‌రోనా కార‌ణంగా.. వాయిదాల ప‌ర్వం కొన‌సాగించాల్సివ‌చ్చింది. ఇప్పుడు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌తో పాటు పెద్ద సినిమాలూ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. కానీ రాధే శ్యామ్ ఇంకా మౌనం వీడ‌లేదు.

 

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం... రాధే శ్యామ్ కూడా రెండు రిలీజ్ డేట్ల‌కు లాక్ చేసింద‌ట‌. మార్చి 4 న‌, లేదంటే మార్చి 11న రాధేశ్యామ్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కంటే రెండు వారాల ముందు రావాల‌న్న‌ది `రాధే శ్యామ్‌` టార్గెట్‌. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` మార్చి 25న కాబ‌ట్టి.. రెండు వారాల ముందు అంటే... మార్చి 11న `రాధేశ్యామ్‌` రావొచ్చు. అంత‌కంటే ముందే రావాలి అనుకుంటే మార్చి 4న వ‌స్తుంది. ఈ రెండు డేట్లూ ప్ర‌స్తుతం ఖాళీగానే ఉన్నాయి. ఇక రిలీజ్‌డేట్ ప్ర‌క‌టించ‌డమే ఆల‌స్యం.

ALSO READ: కేజీఎఫ్ బాట‌లో స‌లార్‌.. ఏం జ‌రుగుతోంది