ENGLISH

రాధేశ్యామ్‌.. ముడు రోజుల స్కోర్ ఎంత‌?

14 March 2022-13:33 PM

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన `రాధేశ్యామ్‌` డివైట్ టాక్‌తో న‌డుస్తోంది. బాలీవుడ్ లో అయితే ఈసినిమాని డిజాస్ట‌ర్ గా తేల్చిపాడేశారు విశ్లేష‌కులు. దానికి త‌గ్గ‌ట్టే.. వ‌సూళ్లతో కుంటి న‌డ‌క న‌డుస్తోంది. ఇప్పుడు నిర్మాత‌లు తెలుగు రాష్ట్రాల వ‌సూళ్ల‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. తొలి రోజు భారీ వ‌సూళ్ల‌తో మంచి ఓపెనింగ్ అందింది. అయితే డివైట్ టాక్ పుణ్యాన రెండోరోజు, మూడో రోజు వ‌సూళ్ల‌లో భారీ త‌గ్గుద‌ల క‌నిపించింది. ఎలా చూసినా.. తొలి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌లిపి దాదాపు 50 కోట్ల వ‌ర‌కూ సాధించింది. మ‌రో 50 కోట్లు తెచ్చుకుంటేగానీ, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లోంచి బ‌య‌ట‌ప‌డ‌లేదు.

 

మూడు రోజుల లెక్క‌లు (ఏపీ, తెలంగాణ‌)

 

నైజాం: రూ.21.5 కోట్లు

సీడెడ్‌: రూ.6.5 కోట్లు

ఉత్త‌రాంధ్ర రూ: 4.1 కోట్లు

గుంటూరు: 4 కోట్లు

ఈస్ట్‌: రూ.3.8 కోట్లు

వెస్ట్‌: రూ.3.02 కోట్లు

కృష్ణ‌: రూ.2.5 కోట్లు

నెల్లూరు: రూ.1.87

 

మొత్తం: రూ. 47.6 కోట్లు

ALSO READ: బాలీవుడ్‌లో అతి పెద్ద డిజాస్ట‌ర్‌