ENGLISH

రాధికా ఆప్టేకి అవగాహన ఎక్కువే

07 June 2017-14:45 PM

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రాధికా ఆప్టే మళ్లీ వార్తల్లోకొచ్చింది. న్యూడ్‌ సినిమాలకు సై అనే హీరోయిన్‌గానే ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంది రాధికా ఆప్టే. తెలుగులో ఒకటీ అరా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు తమిళంలోనూ మంచి పేరు ఉంది. బాలీవుడ్‌లో పలు సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌లో నటించింది. సినిమాల్లో హాటెస్ట్‌ సీన్స్‌లో నటించడానికి ఎప్పుడూ వెనుకాడదు ఈ ముద్దుగుమ్మ. అంతేకాదండోయ్‌ సామాజిక అంశాలపైనా అవగాహన ఎక్కువేనండీ రాధికా ఆప్టేకి. తెలుగు సినిమా 'బాహుబలి'కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ దక్కిందో అందరికీ తెలిసిందే. అలాగే పలు ప్రాంతీయ చిత్రాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంటున్నాయి అంటోంది రాధికా ఆప్టే. భవిష్యత్తులో ప్రాంతీయ చిత్రాలదే హవా అంటూ జోస్యం చెప్పేస్తోంది కూడా. తెలుగులో స్టార్‌ హీరో బాలయ్యతో 'లయన్‌'లో నటించింది. హిందీలో గతేడాది వచ్చిన 'పర్చేద్‌' సినిమాతో అమ్మడు మరింత పాపులర్‌ అయిపోయింది. రజనీకాంత్‌తో నటించిన 'కబాలి' సినిమాలో ట్రెడిషనల్‌ లుక్‌లో హుందాగా నటించి మెప్పించింది. ఎలాంటి పాత్రకైనా ఇట్టే నప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీ, తమిళంలో పలు చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మంచి అవకాశం వస్తే తెలుగులోనూ నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.

ALSO READ: కన్నడ డైరెక్టర్ తో ప్రేమలో పడ్డ హీరోయిన్