ENGLISH

ప‌వ‌న్ సినిమాకి అనుకోని క‌ష్టాలు

17 July 2021-11:32 AM

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకి అనుకోని కష్టం ఎదురైంది. ఈసారి వ‌ర్షం రూపంలో. ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో `అయ్య‌ప్ప‌యున్ కోషియ‌మ్‌` రీమేక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 12 నుంచి కొత్త షెడ్యూల్ కి శ్రీ‌కారం చుట్టారు. అందుకోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దారు. అయితే.. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఆ సెట్ మొత్తం పాడైపోయింది. దాంతో షూటింగ్ ని నిలిపి వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా ఆపేశారు. వ‌ర్షాలు త‌గ్గి, మళ్లీ సెట్ పునః నిర్మాణం జ‌రిగిన త‌ర‌వాతే.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

 

ఈలోగా.. ఈ సినిమా టీమ్ లో కూడా కీల‌క‌మైన మార్పులు జ‌రిగాయి. కెమెరామెన్ గా ప‌నిచేస్తున్న ప్ర‌సాద్ మూరెళ్ల స్థానంలోకి ర‌వి కె.చంద్ర‌న్ వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌సాద్ మూరెళ్ల తీసిన స‌న్నివేశాల్ని ప‌క్క‌న పెట్టి, రీషూట్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో చిత్ర‌బృందం ఉంద‌ని స‌మాచారం. కొత్త షెడ్యూల్ అతి త్వ‌ర‌లో మొద‌ల‌వుతుంది. ఈలోగా పాత స‌న్నివేశాలు ఉంచాలా, తీసేయాలా? అనే విష‌యంలో చిత్ర‌బృందం ఓ నిర్ణ‌యానికి రానుంది.

ALSO READ: ఆచార్య‌లోనూ రాజ‌కీయ సెగ‌