ENGLISH

రాజమౌళి రప్పిస్తున్నాడంతే!

19 August 2017-16:24 PM

బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఈక్వేషన్స్‌ మారిపోయాయి. అప్పటి వరకూ మేమే గొప్ప అనుకున్న బాలీవుడ్‌ నటులంతా ఇప్పుడు కిందికి దిగి వస్తున్నారు. సౌత్‌ సినిమా వైపు తొంగి చూస్తున్నారు. ఇండియన్‌ సినిమా అంటే 'బాహుబలి'నే ఇప్పుడు. 'బాహుబలి' తర్వాతే ఇంకే సినిమా అయినా. ఇప్పట్లో ఈ మాట చెరిగిపోయే అవకాశమే లేదు. అందుకేనేమో బాలీవుడ్‌ తారలు అంత ఎత్తు నుండి కిందికి దిగి వచ్చి, తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. గతంలో ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్‌ తెలుగు సినిమాల్లో నేను నటించనని చెప్పింది. కానీ ఇప్పుడు 'సాహో' సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగు సినిమా చేయడం ఎంతో గర్వంగా ఉందని గొప్పలు చెబుతోంది కూడా. ఈ ముద్దుగుమ్మే కాదు, ఇప్పుడు చాలా మంది బాలీవుడ్‌ భామలు, పెద్ద పెద్ద హీరోలు కూడా తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కొన్ని నెలల క్రితం ఓ సినిమాలో నటించాలి. కానీ అప్పుడు తెలుగులో నటించేందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ 'బాహుబలి'తో మారిన ఈక్వేషన్స్‌ దృష్ట్యా త్వరలోనే ఆయన ఓ తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించారట. ఇదంతా తెలుగు సినిమా గొప్పతనమే అని చెప్పాలి. ఇంతటి ఘన కీర్తి లభించడానికి కారణం రాజమౌళి అనే వ్యక్తి. ఆయన అద్భుత సృష్టి 'బాహుబలి' తెచ్చి పెట్టిన కీర్తి. అందుకే రాజమౌళి కారంణంగానే అగ్రతారలు టాలీవుడ్‌కి దిగి వస్తున్నారనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదనే చెప్పాలి.

ALSO READ: సెన్సార్ చీఫ్ వేటుకి వెనుక ఏక్తా?