ENGLISH

జక్కన్న నెక్స్ట్‌ హీరో ఎవరో?

02 June 2017-11:50 AM

రాజమౌళి 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమాతో యూనివర్సల్‌ డైరెక్టర్‌ అయిపోయారు. జక్కన్న ప్రస్తుతం 'బాహుబలి' సక్సెస్‌ని ఎంజాయ్‌ చేసే మూడ్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి రిలాక్స్‌ అయిన రాజమౌళి, ఈ మధ్యే స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ కోణంలో తన తదుపరి సినిమాపై జక్కన్న కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నట్లు తెలియవస్తోంది. అయితే 'బాహుబలి' అంత స్థాయి సక్సెస్‌ ఫుల్‌ మూవీ తెరకెక్కించిన రాజమౌళి నుండి రాబోయే చిత్రం అదే స్థాయిలో ఉండాలని అంతా కోరుకోవడం సహజమే. కానీ గత ఐదేళ్లుగా రాజమౌళి 'బాహుబలి' సినిమా కోసం చాలా ఎఫర్ట్‌ పెట్టారు. ఆ కారణంగా తన నుండి రాబోయే సినిమాపై ఆ స్థాయిలో అంచనాలు పెట్టుకోవద్దనీ, కానీ అంతకు తగ్గ సినిమానే చేస్తానని రాజమౌళి చెబుతున్నారట. అయితే రాజమౌళి చేయబోయే తాజా చిత్రంలో భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌, సెట్టింగ్స్‌ ఉండకపోవచ్చునట. కానీ ఓ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని జక్కన్న తెరకెక్కించబోతున్నారనీ సమాచారమ్‌. జక్కన్నకు పోరాట ఘట్టాలను చిత్రీకరించడం అంటే చాలా ఇంట్రెస్ట్‌ అని ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ ప్రత్యక్షంగా చెప్పారు. ఆ విషయం ఆయన తెరకెక్కించిన సినిమాల ద్వారా ఆడియన్స్‌కీ విదితమే. అందుకే ఓ మంచి యాక్షన్‌ డ్రామాని రాజమౌళి తెరకెక్కిస్తాడన్న సంగతి అయితే కన్‌ఫామ్‌ అయినట్లే. అయితే రాజమౌళి తదుపరి హీరో ఎవరు అనేదే అందరి ముందున్న ప్రశ్న. రాజమౌళితో సినిమా చేయాలని పలువురు టాలీవుడ్‌ హీరోసే కాదు, బాలీవుడ్‌ హీరోలు కూడా రెడీగా ఉన్నారు. మరి బాహుబలి ఆప్షన్‌ ఎవరో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

ALSO READ: అంధ‌గాడు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్