ENGLISH

అప్ప‌టి విక్ర‌మార్కుడు.. ఇప్ప‌టి రాక్ష‌సుడు

25 June 2021-12:30 PM

సౌత్ ఇండియ‌న్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్ల‌కెంత మ‌క్కువో. ఇక్క‌డి క‌థ‌ల్ని... రీమేకులు చేసుకోవ‌డానికి ఎగ‌బ‌డుతున్నారు. స‌ల్మాన్ ఖాన్ అయితే తెలుగు క‌థ‌ల‌కు పేటెంట్ హ‌క్కులు తీసేసుకున్నాడు. తెలుగులో సూప‌ర్ హిట్ మాస్ క‌థ‌ల‌న్నీ ముందు స‌ల్మాన్ ఖాన్ ద‌గ్గ‌ర‌కే వెళ్తున్నాయి. ఇప్పుడు అక్ష‌య్ కుమార్ కూడా రేసులోకి వ‌చ్చాడు. ర‌వితేజ న‌టించిన `విక్ర‌మార్కుడు`ని బాలీవుడ్ లో `రౌడీ రాథోడ్‌`గా తెర‌కెక్కించి... మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఇప్పుడ మ‌రోసారి తెలుగు సినిమాని రీమేక్ చేయ‌డానికి రెడీ అయ్యాడు.

 

ఇటీవ‌ల తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించిన చిత్రం `రాక్ష‌సుడు`. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ థ్రిల్ల‌ర్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ న‌టించ‌బోతున్నాడు. ఎగ్రిమెంట్లు అన్నీ అయిపోయాయి. ద‌ర్శ‌కుడు ఖ‌రారు కావ‌ల్సివుంది. బాలీవుడ్ లో థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు మంచి గిరాకీ ఉంది. పైగా త‌క్కువ బ‌డ్జెట్లో అయిపోతాయి. అందుకే రాక్ష‌సుడు వైపు దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ALSO READ: పాపం.. హేమ‌ని బ‌లిప‌శువు చేస్తున్నారా?