ENGLISH

రకుల్‌కి 'ది బెస్ట్‌ కాంప్లిమెంట్‌'

26 September 2017-17:23 PM

'స్పైడర్‌' సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్యారెక్టర్‌కి చాలా ప్రాధాన్యత ఉందట. ఈ విషయం స్వయంగా మహేష్‌బాబే చెప్పారు. ఆమె హీరోయిన్‌ కావడం వల్లే ఈ సినిమా అనుకున్న టైంకి పూర్తి చేయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే సినిమా మేకింగ్‌కి ఇంకా టైం పట్టేదనీ మహేష్‌, రకుల్‌ నుద్దేశించి అన్నారు. అంటే ఆమె పాత్ర ఎంత ప్రాధాన్యత గలదో అర్ధం చేసుకోవచ్చు. 'ధృవ' సినిమాలో కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంపార్టెంట్‌ రోల్‌నే ప్లే చేసింది. ఆ తరహాలోనే 'స్పైడర్‌'లో రకుల్‌ పాత్ర కూడా ఉండనుందట. మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకి రకుల్‌ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందో సినిమా చూస్తే తెలుస్తుందట. వరుస విజయాలతో దూసుకెళ్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆమెకి ఈ సినిమా కూడా మంచి విజయం తెచ్చిపెట్టనుందని ఆశిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో మహేష్‌బాబు జోరుగా పాల్గొంటున్నారు. ఇదో బైలింగ్వల్‌ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందింది. మలయాళంలోనూ ఈ సినిమాని విడుదల చేయనున్నారట. తమిళ వెర్షన్‌కి మహేషే డబ్బింగ్‌ చెప్పుకున్నారు. ఇదే తొలిసారి మహేష్‌ తమిళంలో సినిమా చేయడం. ఎస్‌.జె.సూర్య స్పైడర్‌లో విలన్‌గా నటిస్తున్నారు. తమిళ హీరో భరత్‌ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కన్పించబోతున్నాడు. రకుల్‌ ఇంతకు ముందే తమిళ సినిమాల్లో నటించినా, ఈ 'స్పైడర్‌' ఆమెకు అక్కడ వెరీ వెరీ స్పెషల్‌ మూవీ.

 

ALSO READ: మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..