ENGLISH

మహేష్‌తో రకుల్‌ డబుల్‌ ధమాకా!

06 October 2017-16:59 PM

మహేష్‌ బాబు - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం 'స్పైడర్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. పెయిర్‌ చాలా బాగుందంటూ ప్రశంసలు దక్కాయి ఈ జంటకి. హైట్‌, వెయిట్‌ పరంగా చూడముచ్చటగా ఆకట్టుకుంది ఈ సినిమాతో రకుల్‌ - మహేష్‌ జంట. ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ కూడా సూపర్బ్‌. అందుకే ఈ చూడముచ్చటైన జంట మరోసారి అభిమానుల్ని ఆకట్టుకోనుందనీ టాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. ప్రస్తుతం మహేష్‌, కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్‌ అనే నేను' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా మహేష్‌ తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా రకుల్‌ని ఎంచుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌. రకుల్‌ ఈ మధ్య నటించిన సినిమాలన్నీ సక్సెస్‌నందుకున్నాయి. వరుసగా 'రారండోయ్‌ వేడుక చూద్దాం..', జయ జానకీ నాయకా', స్పైడర్‌' వరకూ వరుస విజయాలే రకుల్‌ ఖాతాలో. రకుల్‌ ఏ క్యారెక్టర్‌ చేసినా ఆ క్యారెక్టర్‌కి తగ్గట్లుగా తనని తాను మలచుకుంటుంది. కొన్ని క్యారెక్టర్స్‌కి రకుల్‌ అంతలా సెట్‌ అయిపోతుంది. మహేష్‌తో 'బ్రహ్మూెత్సవం' టైంలోనే రకుల్‌ జత కట్టాల్సి ఉంది. కానీ ఆ ఛాన్స్‌ అప్పుడు మిస్సయ్యింది. ఇప్పుడు 'స్పైడర్‌' రూపంలో వచ్చింది. 'స్పైడర్‌'లో రకుల్‌ క్యారెక్టర్‌లో మరొకర్ని ఊహించలేం. ఆ క్యారెక్టర్‌కి రకుల్‌ కాబట్టే షూటింగ్‌ కంఫర్ట్‌బుల్‌గా అనుకున్న టైంకి పూర్తి చేయగలిగాం అంటూ మహేష్‌ రకుల్‌ని ప్రశంసించడం విశేషం. అందుకే రకుల్‌కి మరో ఛాన్స్‌ ఆఫర్‌ చేశాడేమో మహేష్‌!

ALSO READ: 'భరత్‌ అనే నేను' స్టిల్ లీక్