ENGLISH

నానితో ఐటెంకి రకుల్‌ సిద్ధమా.?

21 February 2019-16:30 PM

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఐటెం సాంగ్‌ చేయబోతోందనే గాసిప్‌ తాజాగా చక్కర్లు కొడుతోంది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఓ మూవీ ఇటీవలే లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమాలో నానికి జోడీగా నలుగురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ లాంఛింగ్‌ డే నాడు ఆ ముద్దుగుమ్మలెవరనే వివరాలు తెలియరాలేదు. 

 

కానీ నలుగురు భామలతో నాని ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధపడుతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఐటెం సాంగ్‌ కోసం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు తెరపైకి రావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రకుల్‌ 'వెంకీ మామ' సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. దాంతో పాటు ఏ చిన్న అవకాశమైనా అందుకునేందుకు సిద్ధంగా ఉంది. అలా అని రకుల్‌ ఏమంత ఖాళీగా లేదండోయ్‌. బాలీవుడ్‌లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తోంది. 

 

లేటెస్ట్‌గా వచ్చిన 'దేవ్‌' రకుల్‌ని కాస్త నిరాశపరిచినా రానున్న సినిమాలపై కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌కి ఓ ప్రత్యేక స్టైల్‌ ఉంది. ఆయన తెరకెక్కించిన 'మనం' సినిమా తరతరాలకూ గుర్తుండిపోయే సినిమా. అఖిల్‌తో 'హలో' మూవీ అనూహ్యంగా ఫెయిలైంది కానీ, ఇప్పుడు నానితో తెరకెక్కించబోయే సినిమాకి సూపర్బ్‌ స్క్రిప్టు ప్రిపేర్‌ చేసుకున్నాడట. ఈ సినిమాలో 'ఆర్‌ఎక్స్‌100' ఫేం కార్తికేయ విలన్‌గా నటిస్తుండడం మరో విశేషం. 

ALSO READ: జోరు పెంచిన రానా హీరోయిన్‌