ENGLISH

అవ‌న్నీ రూమ‌ర్లే అంటున్న ర‌కుల్

24 September 2020-11:30 AM

అవ‌న్నీ రూమ‌ర్లే అంటున్న ర‌కుల్ డ్రగ్స్‌ కేసులో త‌ర‌చుగా వినిపిస్తున్న పేరు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఎన్ సీ బీ అధికారులు జాబితాలో ర‌కుల్ పేరు ఉంద‌ని, త‌న‌ని త్వ‌ర‌లోనే విచారిస్తార‌ని ప్ర‌చారం సాగ‌డం, ఆ త‌ర‌వాత ర‌కుల్ పేరు లేద‌న్న వార్త బ‌య‌ట‌కు రావ‌డం, మ‌ళ్లీ ర‌కుల్ ఉంద‌ని చెప్పుకోవ‌డం.. ఇవన్నీ తెలిసిన విష‌యాలే. తాజాగా ఎన్ సీ బీ అధికారులు ర‌కుల్ కి స‌మ‌న్లు జారీ చేశార‌ని కూడా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఈ వార్త‌ల్ని ఖండించింది ర‌కుల్. తనకు ఎలాంటి నోటిసులు అందలేదంటుంది‌.

 

హైదరాబాద్‌లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్‌సీబీ పంపిన సమన్లు అందలేని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ ప్రీత్ పీఆర్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఎన్ సీ బీ అధికారుల వాద‌న మ‌రోలా ఉంది. ‘ఆమెకు సమన్లు జారీ చేశాం.. తను ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించాము. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. పైగా ఇది కేవలం ఒక సాకు.. ఆమె ఈ రోజు దర్యాప్తుకు హాజరు కాలేదు’ అని తెలిపారు.

ALSO READ: అడివి శేష్ సినిమా 'మేజ‌ర్‌'లో స‌యీ మంజ్రేక‌ర్‌.