ENGLISH

రకుల్‌కి లవ్‌ స్టోరీస్‌ అంటేనే ఇష్టమట

07 June 2017-17:38 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో ముద్దుగుమ్మ రకుల్‌ మేనియా నడుస్తోంది. స్టార్‌ హీరోస్‌తో నటిస్తూనే, మరో పక్క చిన్న హీరోస్‌తోనూ రకుల్‌ జత కడుతోంది. ఇటీవల ఆమె నటించిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా సక్సెస్‌లో టోటల్‌ క్రెడిట్‌ ఈ ముద్దుగుమ్మే కొట్టేసింది. భ్రమరాంబ పాత్ర అంతగా ప్రభావం చూపింది ప్రేక్షకుల్లో. త్వరలోనే 'స్పైడర్‌' సినిమాతో మన ముందుకు రానుంది. మహేష్‌తో నటించే ఛాన్స్‌ అమ్మడికి ఎప్పుడో వచ్చింది. కానీ తృటిలో తప్పింది. కానీ ఆ సినిమా అనూహ్యంగా విజయం అందుకోకపోవడంతో రకుల్‌ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ ఆఫర్‌ని భారీగా దక్కించుకుంది. 'స్పైడర్‌'లో మెడికో పాత్రలో నటిస్తోంది రకుల్‌. అయితే అమ్మడికి ప్యూర్‌ లవ్‌స్టోరీస్‌లో నటించడం అంటే చాలా ఇష్టమట. కానీ ఓన్లీ లవ్‌ స్టోరీస్‌ అని పట్టుకుని కూర్చుంటే కెరీర్‌లో ఎలా ఎదగేది అంటోంది. అయితే రకుల్‌ లవ్‌లో పడిందా అంటే ఇంకా అంత సీను లేదంటోంది. అయినా కానీ లవ్‌లో పడినా ఇంట్లో పెద్ద వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకునేంత ధైర్యం ఉందంటోంది ముద్దుగుమ్మ రకుల్‌. అవును నిజమే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ లేడీనే. 'రారండోయ్‌..' సినిమా నుండి రకుల్‌ యాటిట్యూడ్‌లో చాలా ఛేంజ్‌ వచ్చింది. చాలా హుందాగా వ్యవహరిస్తోంది. అలాగే హైపర్‌ యాక్టివ్‌గా ఉంటుంది కూడా. రకుల్‌కి సినిమా రంగంతోనే కాకుండా, సామాజికంగా చాలా విషయాల్లో మంచి అవగాహన ఉంది. ఎడ్యుకేటెడ్‌ ఫ్యామిలీ నుండి వచ్చింది కదా. తన లైఫ్‌ స్టైల్‌ అంతా చాలా డిసిప్లైన్డ్‌గా ఉంటుంది మరి.

 

ALSO READ: ష్‌.. 'స్పౖడర్‌' బాలీవుడ్‌కెళ్తోంది