ENGLISH

ర‌కుల్ ర‌హ‌స్యం ఇదే!

28 April 2021-10:01 AM

ఆనందం - ఆరోగ్యం ఇవి రెండూ ప‌క్క ప‌క్క‌నే ఉంటాయి. ఈ విష‌యాన్ని ర‌కుల్ ప్రీత్ సింగ్ కాస్త తొంద‌ర‌గానే గ్ర‌హించేసింది. దాంతో ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారిపోయింది. తాను ఫిట్ గా ఉండ‌డ‌మే కాదు, త‌న చుట్టూ ఉన్న‌వాళ్ల‌ని సైతం అలా ఉంచ‌డానికి తాప‌త్ర‌య ప‌డిపోతుంటుంది. అందుకే జిమ్ సెంట‌ర్లు మొద‌లెట్టింది. ఈమ‌ధ్య ర‌కుల్ మ‌రింత నాజూగ్గా క‌నిపిస్తోంది. ఆ ర‌హ‌స్యం ఏమిట‌ని అడిగితే.. `స్విమ్మింగ్` అనేసింది. త‌న‌కు ఈత కొట్ట‌డం చాలా ఇష్ట‌మ‌ట‌, వారానికి రెండు సార్లు, వేస‌విలో అయితే.. ప్ర‌తీరోజూ స్విమ్ చేయాల్సిందే అంటోంది.

 

''స్విమ్ చేయ‌డం అంటే నాకు చాలా ఇష్టం. శ‌రీరం మ‌న ఆధీనంలో ఉండ‌డానికి అది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎండాకాలం వ‌చ్చేసింది క‌దా. అందుకే వీలైనంత సేపు.. స్విమ్మింగ్ పూల్ లో గ‌డుపుతున్నా'' అని త‌న ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పేసింది ర‌కుల్. ప్ర‌స్తుతం `కొండ పొలెం` అనే సినిమాలో న‌టించింది ర‌కుల్. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడు. ఇవి కాక‌.. మ‌రో రెండు మూడు సినిమాలు త‌న చేతిలో ఉన్నాయి.

ALSO READ: Rakul Preet Singh Latest Photoshoot