ENGLISH

ఎన్టీఆర్ ని అభినందించిన రామ్ చరణ్

30 September 2017-19:21 PM

జై లవకుశ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు ఎన్టీఆర్. తొలిసారి మూడు పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జై లవకుశ రికార్డ్ సృష్టించింది. కలక్షన్స్ తో పాటు ఎన్టీఆర్ నటనకు సినీ ప్రముఖుల నుండి ప్రశంసల వర్షం కురిసింది.

తాజాగా ఈ జాబితాలో హీరో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. జై లవ కుశ చిత్రాన్ని చూసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ నటన, ముఖ్యంగా జై పాత్రలో ఆయన పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయని రామ్ చరణ్ అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో అనేక సార్లు తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ పేరు చెప్పిన రామ్ చరణ్, ఇప్పుడు స్వయంగా అభినందించటం పై ఇద్దరు హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ALSO READ: హీరోయిన్ ని అవమానించిన దర్శకుడు