ENGLISH

Ram Charan: రామ్ చరణ్ లేకపోతే గాడ్ ఫాదర్ లేదు

29 September 2022-12:00 PM

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కు రామ్ చరణ్ ఒక నిర్మాత. ఆర్ బి చౌదరీ, ఎన్వీ ప్రసాద్ తో పాటు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కూడా నిర్మాణంలో వుంది. అయితే ఈ సినిమా మొదలవ్వడానికి కారణం మాత్రం రామ్ చరణ్. లూసిఫర్ సినిమా గాడ్ ఫాదర్ గా మారడానికి కారణం రామ్ చరణ్. అలాగే ఈ సినిమా దర్శకుడిని ఎంపిక చేసింది రామ్ చరణ్. అలాగే సల్మాన్ ఖాన్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది కూడా రామ్ చరణ్. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.

 

''మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చూడటం జరిగింది. ఇది గాడ్ ఫాదర్ గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. చరణ్ ముందుకు వచ్చి '' మీ ఇమేజ్ కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్' అని చెప్పాడు. చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్ గా రూపాంతరం చెందింది. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా పేరుని సూచించింది కూడా రామ్ చరణ్ నే. అలాగే సల్మాన్ ఖాన్ మాట్లాడింది కూడా చరణే. చరణ్ ఫోన్ చేసిన చెప్పగానే సల్మాన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. రామ్ చరణ్ ముందుకురాకపొతే గాడ్ ఫాదర్ వుండేది కాదు'' అని చెప్పుకొచ్చారు చిరు.

ALSO READ: ద‌స‌రాకు వ‌స్తున్న జై బాల‌య్య‌