ENGLISH

గేమ్ చేంజర్ మూవీ రివ్యూ & రేటింగ్‌

10 January 2025-10:59 AM

చిత్రం: గేమ్ చేంజర్ 
దర్శకత్వం: శంకర్ 
కథ - రచన : కార్తీక్ సుబ్బరాజు 
మాటలు: సాయి మాధవ్ బుర్రా  


నటీనటులు:  రామ్ చరణ్, కియారా అద్వానీ , అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్ , సముద్రఖని, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, విస్వంత్, బ్రహ్మానందం, వేణు తొట్టెం పూడి, రవి ప్రకాష్, ప్రియదర్శి, సత్య, రాజీవ్ కనకాల, చైతన్య కృష్ణ తదితరులు                


నిర్మాతలు: దిల్ రాజు 
సంగీతం:  తమన్ ఎస్ 
సినిమాటోగ్రఫీ :  తిరు  
ఎడిటర్:  షమీద్ మహామ్మద్ రూబిన్  


బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్   
విడుదల తేదీ: 10 జనవరి 2025 
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

 

మూడేళ్ళుగా రామ్ చరణ్ థియేటర్స్ లోకి వచ్చింది లేదు. RRR మూవీ తరువాత నేడు గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ ఎన్టర్ టైనర్ గా రూపొందింది. ఈ సినిమా చెర్రీతో పాటు శంకర్, దిల్ రాజులకి కూడా ప్రత్యేకమే. ఎందుకంటే రామ్ చరణ్ సోలోగా చేస్తున్న పాన్ ఇండియా సినిమా, దిల్ రాజు కి మొదటి పాన్ ఇండియా సినిమా, శంకర్ మొట్ట మొదటి సారి ఒక తెలుగు హీరోతో కలిసి చేసిన సినిమా. అందుకే మొదటి నుంచి గేమ్ చేంజర్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా  ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ హిట్ అయ్యిందో లేదో, వీరందరి ఆశలు ఫలించాయి లేదో ఈ రివ్యూ లో చూద్దాం. 
                  

కథ :
రామ్ నందన్ (రామ్ చరణ్) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ప్రియురాలు దీపిక (కియారా అద్వానీ) కోరిక మేరకు కష్టపడి ఐఏఎస్ అవుతాడు. విశాఖలో పోస్టింగ్ రావడంతో అక్కడ బాధ్యతలు స్వీకరించి అవినీతిపరులు, అక్రమార్కుల భరతం పట్టేందుకు రంగంలోకి దిగుతాడు. మొదటి రోజే మీటింగ్ పెట్టి అధికారులకు, క్రిమినల్స్, క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ లకు వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో అనేక అక్రమాలకి చెక్ పెడతాడు. రేషన్ బియ్యం - ఇసుక మాఫియాకు అడ్డ కట్ట వేసి మిగతా వాళ్లను దారిలో పెడతాడు. కానీ ఆ మాఫియా వెనుక ఉన్నది సీఎం సత్యమూర్తి (శ్రీకాంత్) కొడుకు బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె. సూర్య) కావటం గమనార్హం. రామ్ నందన్ కారణంగా మోపిదేవి బిజినెస్ దెబ్బ తింటుంది. ఇసుక మాఫియా అంశంలో రామ్ నందన్, మోపిదేవి మధ్య జరిగిన గొడవ, తరవాత జరిగిన అనూహ్య పరిణామాల వలన ఎన్నికల వరకు వెళ్లాల్సి వస్తుంది. మోపిదేవి తండ్రిని చంపి తానే సీఎం అవ్వాలని అనుకుంటాడు. కానీ తన మరణం తరువాత రామ్ నందన్ ను సీఎం గా చేయాలని ఒక వీడియో  మెసేజ్ పెట్టి సత్యమూర్తి చనిపోతాడు. సత్యమూర్తి కోరిక మేరకు రామ్ నందన్ సీఎం అయ్యాడా? మోపిదేవి అయ్యాడా? అసలు సత్యమూర్తి రామ్ నందన్ ను సీఎంగా చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఇంతకీ రామ్ నందన్ పోలికలతో ఉన్న అప్పన్న (రామ్ చరణ్) ఎవరు? ఆయన మరణానికి కారకులు ఎవరు? అప్పన్న భార్య పార్వతి (అంజలి)ని చూసి సీఎం ఎందుకు షాక్ అయ్యాడు? ఎన్నికల్లో ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ: 
ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఆ లెక్కే వేరు. ఎదో ఒక సామాజిక అంశాన్ని తీసుకుని, చక్కని మెసేజ్ ఇస్తూ యాక్షన్ ఎన్టర్ టైనర్ గా తీర్చి దిద్దేవారు. హీరోయిజం, భారీ సెట్స్, పాటలు అన్నీ బాగుండేవి. కానీ ఈ మధ్య శంకర్ కొంచెం తడబడుతున్నారు. హిట్స్ మాట పక్కనపెడితే విమర్శలు ఎదుర్కొంటున్నారు. 'ఇండియన్ 2' లో ఇదే గమనించారు ఆడియన్స్. భారతీయుడు ఫస్ట్ పార్ట్ అద్భుతంగా తెరకెక్కించిన శంకర్ సీక్వెల్ లో ఆ మార్క్ చూపించలేకపోయాడు. దీనితో గేమ్ చేంజర్ లో కూడా అదే రిపీట్ అవుతుందా ఏంటి అని మెగా ఫాన్స్ ఆందోళన చెందారు. కానీ ట్రైలర్, టీజర్ తో అంచనాలు పెంచాడు శంకర్. తనకి కలసి వచ్చిన జోనర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో మెసేజ్ ఇచ్చే కథని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గేమ్ చేంజర్ లాంటి  ఓ ఫుల్ ఫ్లెడ్జ్ కమర్షియల్ మూవీ తీసి తన స్పెషాలిటీ ఏంటో నిరూపించుకున్నాడు శంకర్. శంకర్ మార్క్ కథకి చెర్రీ లాంటి పవర్ ఫుల్ యాక్టర్ తోడవటంతో  కొన్ని సీన్స్ మరింత హైలెట్ అయ్యాయి. చాలా చోట్ల చెర్రీ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉండి సినిమాకి ప్లస్ అయ్యింది.  


అవినీతిపరుడైన మంత్రిని, సీఎం కావాలని కలలు కని సొంత తండ్రిని చంపాలని చూసే కొడుకుని కలెక్టర్ గా రామ్ నాథం ఎలా కంట్రోల్ చేశాడు? అన్నది మెయిన్ స్టోరీ. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అందించిన ఈ కథకి కమర్షియల్ హంగులు అద్దారు శంకర్. కొత్తదనం లేకపోయినా శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ప్రేక్షుకుడు మెచ్చే అన్ని కమర్షియల్ హంగులు ఈ మూవీలో ఉన్నాయి. హీరో ఇంట్రడక్షన్ సీన్ హైలెట్.  హీరో - విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ తీయడంలో  శంకర్ ఆడియన్స్ ని మెప్పించారు. హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ కామన్ గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆడియన్స్ కి మంచి సర్ప్రయిజ్ అనే చెప్పాలి. క్లైమాక్స్ పరవాలేదనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ మూవీ మెగా ఫాన్స్ కి బాగా నచ్చుతుంది. పొలిటికల్ గా ఈ మూవీ జనసేనకు ప్లస్ అని చెప్పోచ్చు. మోపిదేవి (సూర్య) క్యారెక్టర్ ని ఉద్దేశించి వేసిన కొన్ని డైలాగ్స్ ప్రతిపక్షానికి వర్తిస్తాయి.  'డబ్బు లేని రాజకీయాలు చేయాలి' అని అప్పన్న పాత్ర చెప్పే సిద్ధాంతాలు జనసేన రాజకీయాన్ని గుర్తు చేసేలా ఉన్నాయి. పాటలకి భారీగా ఖర్చు పెట్టినట్లు ముందే విని ఉన్నాం. ఇప్పడు అది తెర పై తెలుస్తోంది. 


'గేమ్ చేంజర్' పక్కా కమర్షియల్ అండ్ పొలిటికల్ సినిమా. పాన్ ఇండియా సినిమాకి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి ఈ మూవీలో. శంకర్ మార్క్ సీన్స్, చెర్రీ అద్భుత నటన, తమన్ బ్యాక్ గ్రౌండ్ అండ్ మ్యూజిక్ అన్నీఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. అని కలగలిపి కంప్లీట్ పవర్ ప్యాక్ మూవీ అని చెప్పొచ్చు. రాజకీయ కథలంటే ఇంట్రస్ట్ ఉన్న వాళ్లకి, ఏపీ రాజకీయాలు అవగాహన ఉన్నవారికి ఈ కథ ఇంకా నచ్చుతుంది.  

 

నటీ నటులు:
గేమ్ చేంజర్ లో  రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించాడు. ఒకటి ఫ్లాష్ బ్లాక్ లో వచ్చే  అప్పన్న పాత్ర, రెండు రామ్ నందన్ అనే కలక్టర్ పాత్ర. డైనమిక్ అండ్ డేరింగ్ కలక్టర్ గా ఎంత ఆకట్టుకున్నాడో అప్పన్న అనే మాస్ లుక్ లో కూడా అంతే ఆకట్టుకున్నాడు. రెండు విభిన్న పాత్రల్లోనూ అలరించాడు చెర్రీ. రెండూ నటనకి ఆస్కారమున్న పాత్రలు కావటంతో రెండిటిలో చరణ్ నట విశ్వరూపం చూపించాడు. అప్పన్న పాత్రలో చెర్రీ నత్తివాడిలా పర్ఫెక్ట్ గా డైలాగ్స్ పలికించాడు.  రామ్ నందన్ లుక్ లో చరణ్ చాలా స్టైలిష్ గా డిగ్నిటీ గా ఉన్నాడు. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ  రామ్ చరణ్ అని చెప్పటం ఏమాత్రం అతిశయం అనిపించదు.     కియారా గ్లామర్ డాల్ గా మెరిసింది. నటనకి ఎక్కువ స్కోప్ లేదు. గ్లామర్ తో మాత్రం మెప్పించింది. పార్వతి గా నటించిన అంజలి పాత్రకు ప్రాధాన్యత ఉంది.  స్క్రీన్ స్పేస్ తక్కువున్నా తన నటనతో కావలసినంత ఎటెన్షన్ రాబట్టుకుంది. SJ  సూర్య విలనిజం రొటీన్ గా అనిపించింది. కొన్ని సార్లు ఈ పాత్రలో ఇంకెవరైనా అయితే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చి ఉండేది అనిపిస్తుంది. కారణం ఈ మధ్య అన్ని సినిమాల్లో SJ సూర్య విలన్ గా నటిస్తున్నాడు. అదే విలనిజం. అవే పాత్రలు కొత్తదనం లేదు. కానీ వీరి కాంబో సీన్స్ హైలెట్ అయ్యాయి. చాలా కాలం తరువాత  శ్రీకాంత్ కి మంచి పాత్ర పడింది. శ్రీకాంత్ కూడా తన నటనతో మెప్పించాడు.   రాజీవ్ కనకాల, సముద్ర ఖని, సునీల్, సీనియర్ నరేష్, కంచరపాలెం కిషోర్ లాంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కొన్ని పాత్రలు ఉన్నట్లు కూడా గుర్తించలేము.  ప్రియదర్శి, వైవాహర్ష, కమెడియన్ సత్య పాత్రలు కేవలం ఒకటి రెండు సార్లు కనిపించి మాయం మవటం తెలుగు ఆడియన్స్ కి కొంచెం నిరాశగా ఉంటుంది.  


టెక్నికల్ :
టెక్నికల్ గా గేమ్ చేంజర్ పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది.  శంకర్ సినిమా స్థాయిని మరింత పెంచేలా  ఉంది సినిమాటోగ్రఫీ. సాయి మాధవ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా, ఆలోచింప జేసేలా ఉన్నాయి. పాటలు వినటానికి , చూడటానికి కూడా బాగున్నాయి. పాటల్లో రిచ్ నెస్ తెలుస్తోంది. ఎడిటింగ్ పై మరింత శ్రద్ద తీసుకుని ఉంటే బాగుండేది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకే హైలెట్. తమన్ అందించిన BGM సినిమాను ఎలివేట్ చేయడంలో ఉపయోగపడింది. ఖర్చు పెట్టడంలో దిల్ రాజు ఎక్కడా తగ్గలేదని తెలుస్తోంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్ బావుంది. హీరో ఎలివేషన్స్ షూట్  చేయటంలో కెమెరా వర్క్  సూపర్. 

 

ప్లస్ పాయింట్స్ 

అప్పన్న పాత్ర 
తమన్ మ్యూజిక్ 
పాటలు 

 

మైనస్ పాయింట్స్ 

లవ్ స్టోరీ 
రొటీన్ సీన్స్ 
లాజిక్స్ మిస్ 


ఫైనల్ వర్దిక్ట్ :  శంకర్ మార్క్ లేని 'గేమ్ చేంజర్'..