ENGLISH

చ‌ర‌ణ్‌తో ప‌క్కా మాస్ సినిమా

24 March 2022-12:03 PM

`మ‌ళ్లీ రావా`, `జెర్సీ` సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు గౌత‌మ్ తిన్న‌నూరి. అవి రెండూ క్లాస్ సినిమాలే. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అయితే చ‌ర‌ణ్ ఇమేజ్ వేరు. త‌న‌కు మాస్ క‌థ‌లే సూట‌వుతాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే గౌత‌మ్ ఈసారి ప‌క్కా మాస్ క‌థ‌తో వస్తున్నాడ‌ట‌. గ‌త రెండు సినిమాల‌కంటే భిన్నంగా, పూర్తిస్థాయి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో గౌత‌మ్ తిన్న‌నూరి ఈ స్క్రిప్టుని త‌యారు చేశాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి.

 

మేలో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా మొద‌లెడ‌తారు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్తుంది. మ‌రోవైపు... రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూన్ నాటికి దాదాపు స‌గం సినిమా పూర్త‌వుతుంది. దానికి స‌మాంత‌రంగానే గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్టు మొద‌ల‌వుతుంది. 2023 సంక్రాంతికి శంక‌ర్ సినిమా వ‌స్తుంది. అదే యేడాది గౌత‌మ్ సినిమానీ విడుద‌ల చేస్తారు. అంటే... 2023లో చ‌ర‌ణ్ నుంచి రెండు సినిమాలొస్తాయ‌న్న‌మాట‌.

ALSO READ: ప్రాజెక్ట్ 'కె'కీ... సూర్య సినిమాకీ సంబంధం ఏమిటి?