ENGLISH

చరణ్‌ మనసులో ఏముంది?

04 February 2020-09:00 AM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్‌ నటించబోయే సినిమా ఏంటీ.? అనే విషయంలో గత కొన్నాళ్లుగా సీరియస్‌ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. కథల ఎంపికలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండే రామ్‌ చరణ్‌ ఎందుకో బోయపాటి విషయంలో పొరపాటు చేశాడు. 'వినయ విధేయ రామ' స్క్రిప్టు విషయంలో రాంగ్‌ స్టెప్‌ వేసి, బోల్తా పడ్డాడు. కానీ, ఆ పొరపాటు ఇకపై చేయకూడదనుకుంటున్నాడట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా స్థాయి వేరు. కానీ, ఆ తర్వాత చిత్రం విషయంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలి.

 

అయితే, చరణ్‌ ఊ.. అంటే చాలు సినిమా తెరకెక్కించడానికి అనిల్‌ రావిపూడి ఎదురు చూస్తున్నాడు. ఆల్రెడీ చరణ్‌కి స్టోరీ లైన్‌ వినిపించాడని కూడా సమాచారం ఉంది. అయితే, చరణ్‌ మనసులో మరో డైరెక్టర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌తో చరణ్‌ సినిమా చేయాలనుకుంటున్నాడట. అదేంటీ.? 'సాహో'తో సుజిత్‌ ఫెయిలయ్యాడుగా.. అనుకుంటున్నారా.? భారీ బడ్జెట్‌ చిత్రం కనుక 'సాహో'ని డీల్‌ చేయలేకపోయాడు సుజిత్‌. కానీ, సుజిత్‌లో ఓ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ దాగున్నాడని చరణ్‌ గుర్తించాడట. సో సుజిత్‌తో బ్రిలియంట్‌ కాన్సెప్ట్‌కి రూపమిచ్చే ఆలోచనలో చరణ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరి బ్రిలియంట్‌ డైరెక్టర్‌కి చరణ్‌ ఛాన్సిస్తాడా.? లేక సింపుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్‌ రావిపూడినే లైన్‌లోకి తీసుకొస్తాడా.? అనేది వేచి చూడాలిక.

ALSO READ: తమ్ముడితో నటిస్తూ, అన్ననీ లైన్‌లో పెట్టేసిందా?