ENGLISH

చరణ్‌ - సుకుమార్‌ 'రంగస్థలం'

09 June 2017-10:44 AM

చరణ్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇంతవరకూ పలు టైటిల్స్‌ పరిశీలించిన ఈ చిత్రానికి అదిరిపోయే టైటిల్‌ని సెట్‌ చేశారు. అదే 'రంగస్థలం'. టైటిల్‌ అదిరింది కదా. పల్లెటూరి వాతావరణంలో చాలా ఆహ్లాదంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. అందుకే అంతే ఆహ్లాదమైన టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టారు. 'రంగస్థలం 1985' అనే టైటిల్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఈ టైటిల్‌ పట్ల అంతా సంతృప్తిగా ఉన్నారు. 1985 కాలం నాటి స్టోరీ ఇది. ఓ పల్లెటూరిలో జరిగే క్యూట్‌ లవ్‌ స్టోరీ. పల్లెటూరి కుర్రోడి గెటప్‌లో చరణ్‌ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయే రెస్పాన్స్‌ అందుకుంటోంది ఇప్పటికే. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. తొలిసారిగా సమంత, చరణ్‌తో జోడీ కడుతోంది. అంతేకాదు ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఈ చిత్రంలో చరణ్‌ మూగ, చెవుడు ఉన్న కుర్రాడిలా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. సుకుమార్‌ సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్‌ ఆస్థాన సంగీత విద్వాంసుడు. 1985 కాలానికి తగ్గట్లుగా వినసొంపైన మ్యూజిక్‌ని అందించాడు దేవి ఈ సినిమాకి.వేసవి తీవ్రత కారణంగా కొన్ని రోజులు షూటింగ్‌ విరామం తీసుకున్నారు. త్వరలో నెక్స్ట్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. చరణ్‌ గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ కోసం చాలా కసరత్తులు జరిగాయి.

ALSO READ: తన పెళ్లి తేదీని ఖరారు చేసిన చైతు