ENGLISH

రామ్ చ‌ర‌ణ్‌... పోలీసు నుంచి.. పొలిటిషియ‌న్ వ‌ర‌కూ!

05 July 2021-16:01 PM

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - శంకర్ సినిమా ఖాయ‌మైంది. ఈ విష‌యాన్ని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్ర‌క‌టించారు. చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల‌తో సినిమా చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దిల్ రాజుకి నిర్మాత‌గా ఇది 50వ చిత్రం. కాబ‌ట్టి.. చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

 

ఈ లోగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. చ‌ర‌ణ్ కోసం శంక‌ర్ పొలిటిక‌ల్ డ్రామా రాసుకున్నాడ‌ని ఇది వ‌ర‌క‌టి నుంచే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఓ నిజాయ‌తీగల పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఓ పోలీస్‌.. ఇక్క‌డి రాజ‌కీయాల‌కు త‌లొంచ‌లేక‌, త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ త‌ర‌వాత రాజ‌కీయాల్లోకి చేరి, ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడ‌న్న‌ది సినిమా క‌థ అని తెలుస్తోంది. `తుఫాన్`లో రామ్ చ‌ర‌ణ్ పోలీస్ గా క‌నిపించాడు. ఆ త‌ర‌వాత‌.. మ‌ళ్లీ ఖాకీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల వేట సాగుతోంది. త్వ‌ర‌లోనే హీరోయిన్ పేరు ఫిక్స్ చేస్తారు.

ALSO READ: రామ్ చ‌ర‌ణ్ సినిమాకి లైన్ క్లియ‌ర్‌