ENGLISH

12 రోజుల్లో.. చ‌ర‌ణ్ వాటా 8 రోజులు

02 July 2021-14:12 PM

లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఎత్తేసిన త‌ర‌వాత‌.. షూటింగుల‌కు మార్గం సుగ‌మం అయ్యింది. థియేట‌ర్లు తెర‌చుకుని, కొత్త సినిమాలేం రావ‌డం లేదు గానీ, షూటింగుల హ‌డావుడి మాత్రం మొద‌లైపోయింది. ముఖ్యంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌, అఖండ లాంటి పెద్ద సినిమాలు మ‌ళ్లీ కొత్త గా క్లాప్ కొట్టుకున్నాయి. ఈ జాబితాలో `ఆచార్య‌` కూడా చేర‌బోతోంది.

 

చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య‌`. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌ధారి. కాజ‌ల్, పూజా హెగ్డే క‌థానాయిక‌లు. ఈనెల 8 నుంచి.. ఆచార్య షూటింగ్ మొద‌లు కాబోతోంద‌ని స‌మాచారం. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 12 రోజుల షూటింగ్ మాత్ర‌మే బాకీ ఉంది. అందులో 8 రోజులు రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తార్ట‌. ఇందులో ఓ పాట కూడా ఉంద‌ని స‌మాచారం. మ‌రిగిలి 4 రోజులూ చిరుపై సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఈనెల‌లోనే ఆచార్య షూటింగ్ మొత్తం పూర్త‌యిపోతుంద‌ని, ద‌స‌రాకి ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఆచార్య నుంచి ఇప్ప‌టికే ఓ పాట విడుద‌లైంది. ఇప్పుడు మ‌రో పాట‌ని కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

ALSO READ: ఫుల్ స్వింగ్ లో వెంకీ.. చేతిలో మ‌రో మూడు సినిమాలు