ENGLISH

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌: దటీజ్‌ రామ్‌గోపాల్‌ వర్మ

18 September 2017-17:32 PM

రియల్‌ ఇంట్రెస్టింగ్‌ స్టోరీస్‌ని తెరకెక్కించడంలో రామ్‌గోపాల్‌ వర్మ ముందుంటాడు. కాంట్రవర్సీ స్టోరీస్‌ని ముఖ్యంగా ఎంచుకుంటాడు వర్మ. టైటిల్‌ అనౌన్స్‌ చేసి సెన్సేషన్‌ సృష్టిస్తాడు. స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై ఇప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ దృష్టి పడింది.ే ఈ సినిమాకి వర్మ పెట్టిన టైటిల్‌ ఏంటో తెలుసా? 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'. అంటే సినిమా స్టోరీ లక్ష్మీ పార్వతి యాంగిల్‌ నుండి ఉండొచ్చని సినీ ప్రముఖుల అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై సినిమా తీస్తానని వర్మ ప్రకటించారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రలోని పలు అంశాల్ని వర్మ నిశితంగా పరిశీలించిన పిమ్మట ఆయన జీవితంలో ముఖ్య పాత్ర ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అని భావించి, వర్మ ఈ టైటిల్‌ని యాప్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనుకూల, అననుకూల పరిస్థితలను, అధిగమించిన ఉన్నత శిఖరాలను, వెన్నుపోటు పొడిచిన తీరును ఇలా పలు అంశాల్ని తన సినిమాలో చూపిస్తానని వర్మ అన్నారు. అలాగే తెలుగు ప్రజలు గర్వించదగ్గ గొప్ప నటుడు ఎన్టీఆర్‌. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించడం నా అదృష్టంగా భావిస్తున్నాననీ, ఎప్పుడెప్పుడు ఈ సినిమాని పట్టాలెక్కిస్తానా? అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నానని వర్మ అన్నారు. మరో పక్క బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తెరకెక్కించే యోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్‌ ఎవరన్నదీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది ముందుగా పట్టాలెక్కుతుందో ఏ రకంగా ఈ ప్రాజెక్ట్‌ కార్య రూపం దాల్చుతుందో చూడాలిక.

ALSO READ: విజయశాంతికి మద్రాసు హైకోర్టు షాక్!