ENGLISH

'న‌గ్నం' గా రాంగోపాల్ వ‌ర్మ‌

06 June 2020-16:00 PM

రాంగోపాల్ వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. త‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాలే కాదు, మాట‌లు... చేత‌లు కూడా భిన్నంగా ఉంటాయి. థియేట‌ర్లు లేక‌.. సినిమాని ఎలా విడుద‌ల చేసుకోవాలో తెలీక‌.. చిత్ర‌సీమ అంతా బెంగ పెట్టుకుంటే, ఆర్జీవీ హాయిగా ఆన్‌లైన్‌లోనే త‌న సినిమాని వదిలేస్తున్నాడు. ఆర్జీవీ కొత్త సినిమా 'క్లైమాక్స్' ఈరోజు నుంచి ఆన్ లైన్ స్ట్రీమింగ్ కానుంది. కానీ ఈ సినిమా చూడాలంటే వంద రూపాయలు చెల్లించాల్సివుంటుంది.

 

ఈలోగా మ‌రో కొత్త సినిమాని ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌. పేరు 'న‌గ్నం'. పేరు బ‌ట్టి ఇందులో ఏం ఉండ‌బోతోందో ఊహించుకోవొచ్చు. ఆర్జీవీ సినిమాకి హార‌ర్‌, క్రైమ్‌, సెక్స్ అంటే చాలా ఇష్టం. వాటి చుట్టూనే క‌థ‌లు న‌డ‌ప‌గ‌ల‌డు. 'న‌గ్నం'లోనూ అలాంటి కంటెంట్ చాలా ఉంద‌ట‌. ఈ సినిమానీ ఇలానే ఆన్‌లైన్‌లోనే విడుద‌ల చేస్తానంటున్నాడు వ‌ర్మ‌. సినిమాలే కాదు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా రూపొందిస్తాన‌ని, వాటినీ ఆన్‌లైన్‌లోనే చూపిస్తాన‌ని అంటున్నాడు ఆర్జీవీ.

ALSO READ: రాయ‌ల‌వారు.. విచ్చేస్తున్నార‌హో..!