ENGLISH

సుమంత్ రెండో పెళ్లి... వ‌ర్మ విచిత్ర‌మైన ట్వీట్

29 July 2021-15:07 PM

అక్కినేని క‌థానాయ‌కుడు సుమంత్ రెండో పెళ్లికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. సుమంత్ పెళ్లి వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అక్కినేని అభిమానులు, సినీ సెల‌బ్రెటీలు, సుమంత్ స‌న్నిహితులు సుమంత్ కి శుభాకాంక్ష‌లు చెబుతోంటే.. రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం విచిత్ర‌మైన ట్వీట్ చేశాడు.

 

``ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ కర్మ.. ఆ పవిత్ర కర్మ.. అనుభవించండి! పెళ్లంటే నూరేళ్ల పెం* అయితే.. రెండో పెళ్లేంటయ్య స్వామి? నా మాట విని మనెయ్యి. పవిత్ర గారు.. మీ జీవితాలని పాడు చేసుకోండి.. తప్పు మీది .. సుమంత్ దీ కాదు .. తప్పు ఈ ధౌర్భాగ్యపు వ్యవస్థది`` అంటూ ఆర్జీవీ విచిత్ర‌మైన ట్వీట్ చేశాడు. వ‌ర్మకి ముందు నుంచీ వివాహ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం లేదు. త‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని చాలాకాలం అయ్యింది. అప్ప‌టి నుంచీ ఒంట‌రిగానే ఉంటున్నాడు. పెళ్లికి సంబంధించిన టాపిక్ ఎత్తిన‌ప్పుడ‌ల్లా వ‌ర్మ ఇలానే స్పందిస్తాడు. కాక‌పోతే.. మ‌రొక‌రు పెళ్లి చేసుకుంటున్న‌ప్పుడు ఇలా ఎవ‌రైనా చెబుతారా? వ‌ర్మ‌కి పెళ్లి పై న‌మ్మ‌కం లేక‌పోయినంత మాత్రాన అంతా అలానే ఉండాల‌నుకోవ‌డం త‌ప్పు.

 

వ‌ర్మ‌కీ అక్కినేని కుటుంబానికీ మంచి అనుబంధం ఉంది. సుమంత్ కూడా ఓ సినిమా చేశాడు. ఆ చ‌నువుతో ఇలా ట్వీట్ చేశాడేమో. అయితే... ఈ ట్వీట్ పై సుమంత్ ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు.

ALSO READ: మా ఎన్నిక‌లు ఏక‌గ్రీవ‌మైతే.. ఛాన్స్ ఎవ‌రికి?