ENGLISH

సన్నీలియోన్‌ షార్ట్‌ ఫిలిం కేరాఫ్‌ వర్మ

03 June 2017-16:15 PM

'నా కూతురు సన్నీలియోన్‌ అవ్వాలనుకుంటోంది'. ఎవరు వర్మ కూతురు అనుకుంటున్నారా? ఆగండాగండి అయితే మీరు తప్పులో కాలేసినట్లే. వర్మ కూతురుకి ఎప్పుడో పెళ్లయిపోయింది. ఇదో షార్ట్‌ ఫిలిం టైటిల్‌. ఎవరు తెరకెక్కిస్తున్నారనుకుంటున్నారా? ఇంకెవరు మన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మే. సన్నీలియోన్‌పై తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ ఆమెపై ఆనేక సార్లు ప్రస్థావనలు కూడా తీసుకొచ్చాడు వర్మ సోషల్‌ మీడియాలో. అయితే ఈ సారి ఏకంగా ఆమెపై ఓ షార్ట్‌ ఫిల్మే తీసేశాడు. అయితే అందులో సన్నీలియోన్‌ నటించడం లేదులెండి. ఓ మధ్య తరగతి అమ్మాయి తనకు సన్నీలియోన్‌ అవ్వాలని ఉందని తన తల్లదండ్రులతో చెబుతుంది. అందుకు వారు ఇష్టపడరు. ఆమెని మందలిస్తారు. కానీ ఆమె తన అభిప్రాయం మార్చుకోదు. 'ఒక్కొక్కరికి ఒక్కో ప్లస్‌ పాయింట్‌ అంటుంది. అలాగే నాకు నా శరీరం ప్లస్‌ పాయింట్‌. నేను నా శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి లాభం పొందాలనుకుంటున్నా ఇందులో తప్పేముంది..' అంటూ షార్ట్‌ ఫిలింలో అమ్మాయి చెప్పే డైలాగులివి. 11 నిముషాల ఈ షార్ట్‌ ఫిలింలో ఇలాంటి డైలాగ్స్‌ చాలా ఉన్నాయట. నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. ఈ ముద్దుగుమ్మ గతంలో 'వంగవీటి' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ షార్ట్‌ ఫిలిం విడుదలైంది. ఇటీవలే వర్మ 'గన్స్‌ అండ్‌ థైస్‌' పేరుతో తెరకెక్కించిన ఓ వెబ్‌ సిరీస్‌ చాలా దుమారమే లేపింది. అంతలోనే ఈ లేటెస్ట్‌ షార్ట్‌ ఫిలింతో మరోసారి వర్మ వార్తల్లో నిలిచారు.

 

ALSO READ: హరీష్ శంకర్ 'డీజే' పాటపై నా స్పందన: