ENGLISH

రామ్ సినిమాకి అనుకోని ఆటంకం

26 June 2021-15:22 PM

రామ్ - లింగు స్వామి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంలో ఇంకా క్లారిటీ రావాల్సివుంది. ఇటీవ‌లే లింగు స్వామి - రామ్ మ‌ధ్య భేటీ జ‌రిగింది. క‌థ చాలా అద్భుతంగా ఉంది.. అంటూ రామ్ త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్‌లోనూ పంచుకున్నాడు.

 

అయితే.. ఇప్పుడు ఈసినిమాకి అనుకోని అవాంత‌రం ఎదురైంది. లింగుస్వామిపై ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఫిర్యాదు రావ‌డ‌మే అందుకు కార‌ణం. ప్ర‌ముఖ నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా లింగు స్వామిపై తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఫిర్యాదు చేశారు. త‌న గ‌త సినిమాలు, వాటి లెక్క‌లూ తేల్చాకే... లింగు స్వామి కొత్త సినిమా చేయాల‌ని, ఈలోగా మ‌రో సినిమా మొద‌లెడితే.. స‌హాయ నిరాక‌ర‌ణ చేయాల‌ని, జ్ఞాన‌వేల్ రాజా ఈ ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు టాక్. లింగు స్వామి త‌మిళ సినిమాలు ఆమ‌ధ్య ఫ్లాప్ అయ్యాయి. వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. జ్ఞావ‌వేల్ రాజా ఒక్క‌డే కాదు.. లింగుస్వామిని అడ్డుకోవాల‌ని చాలా మంది త‌మిళ నిర్మాత‌లు ఎదురు చూస్తున్నార‌ని, వాళ్లు రామ్ సినిమాకి ఏదో లా అడ్డుప‌డుతూనే ఉంటార‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

ALSO READ: లూసీఫ‌ర్‌.. ఉంటుందా.. ఆగుతుందా?!