ENGLISH

రెడ్ కి మ‌ళ్లీ రంగు ప‌డింది

23 April 2021-11:37 AM

ఈ సంక్రాంతికి విడుద‌లైన సినిమాల్లో `రెడ్‌` ఒక‌టి. రామ్ ద్విపాత్రాభిన‌యం పోషించిన సినిమా ఇది. త‌మిళ హిట్ చిత్రానికి రీమేక్ గా వ‌చ్చింది. అయితే.. స‌రైన ఫ‌లితాన్ని అందుకోలేదు. సంక్రాంతి సీజ‌న్ లో రిలీజ్ అయ్యింది కాబ‌ట్టి, స‌రిపోయింది. లేదంటే.. భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సివ‌చ్చేది. ఇప్పుడు బుల్లి తెర‌పైనా రెడ్‌.. సిగ్న‌ల్ ప‌డిపోయింది.

 

తొలిసారి జెమినీ టీవీలో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తే... 5 రేటింగ్ కూడా రాలేదు. చిన్న హీరో సినిమాల‌కు 5 రేటింగ్ సంపాదించ‌డం చాలా ఈజీ. అలాంటిది... స్టార్ హీరో సినిమాకి ఆ రేటింగ్ రాలేదంటే ఆశ్చర్య‌ప‌రుస్తోంది. మా టీవీలో ప్ర‌సార‌మైన జాంబీ రెడ్డికి ఏకంగా 9 రేటింగ్ వచ్చింది. ఈ రెండు సినిమాల మ‌ధ్య తేడా ఎంత ఉందో అర్థం చేసుకోవొచ్చు. రామ్ కి ఉన్న క్రేజ్‌, ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌వాత వ‌చ్చిన‌మైలేజీ చూసి, రెడ్ సినిమాని జెమినీ మంచి రేటుకే కొనుగోలు చేసింది. కానీ.. ఫలితం మాత్రం రాలేదు.

ALSO READ: ఎన్టీఆర్‌.. త్రివిక్ర‌మ్‌.... మ‌ళ్లీ చేస్తారా?