ENGLISH

రామ్ సినిమా టైటిల్ అలా వెళ్లిపోయింది

31 July 2021-14:24 PM

హ‌రి క‌థ‌.. ఈ టైటిల్ ఇది వ‌ర‌కే బ‌య‌ట‌కు వ‌చ్చింది. రామ్ హీరోగా ఓ సినిమాకి ఈ టైటిల్ అనుకున్నారు. ఆ త‌ర‌వాత ఆ సినిమా `నేను.. శైల‌జ‌` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొంత‌కాలానికి మ‌రో హీరో కూడా `హ‌రి క‌థ` పేరుతో సినిమా చేద్దాం అనుకున్నాడు. అదీ ఆగిపోయింది. ఇప్పుడు ఈ టైటిల్ తో ఎం.ఎస్‌.రాజు ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని టాక్‌.

 

ఈమ‌ధ్య ఎం.ఎస్‌.రాజు మంచి దూకుడుమీద ఉన్నారు. `థ‌ర్టీ హ‌రీ` పేరుతో ఓ మ‌సాలా సినిమా తీశారు. అది బాగానే ఆడింది. ఇప్పుడు హాట్ కంటెంట్ తో మ‌రో సినిమా సిద్ధం చేస్తున్నారు. ఈలోగా `హ‌రి క‌థ` అనే టైటిల్ ని రిజిస్ట‌ర్ చేయించారు. ఈ సినిమాలో హీరో ఎవ‌ర‌న్న‌ది తెలియ‌లేదు.కాక‌పోతే.. ఓ యువ హీరోనే న‌టించ‌బోతున్న‌ట్టు టాక్‌. `ద‌ర్టీ హ‌రి`కి ఇది సీక్వెల్ లేదా, ప్రీక్వెల్ కావొచ్చ‌న్న‌ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఎం.ఎస్‌.రాజు ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయో చూడాలి.

ALSO READ: ఆ ల‌క్ష క‌ట్టలేవా విజ‌య్‌..?!