ENGLISH

'లీడర్‌' రానా సూపర్‌ మాస్‌ గురూ!

06 June 2017-11:48 AM

రానా హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. రానా పవర్‌ ఫుల్‌ లుక్‌లో మాస్‌ అప్పీల్‌తో కనిపిస్తున్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. రానా రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో నటిస్తున్నాడు. లుంగీ కట్టి రానా ఫ్యాన్స్‌కి అదిరిపోయే కిక్‌ ఇస్తున్నాడు. రానా గెటప్‌, డైలాగులు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయట ఈ సినిమాలో. తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజర్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. 'నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్‌ చేస్తా.. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్‌ చేస్తా.. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి..' అంటూ రానా చెప్పే డైలాగులు అదిరిపోతున్నాయి. అసలే 'బాహుబలి' వంటి సినిమాలో 'భళ్లాదేవుడిలా భీకరమైన పాత్ర పోషించాడు కదా. అందుకే రానాకి డైలాగులు కొత్త కాదు. తేజ చాలా కాలం గ్యాప్‌ తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా ఇది. డైలాగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తేజ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆయన డైరెక్షన్‌లో కాజల్‌ నటిస్తోన్న చిత్రం కూడా ఇది. 'బాహుబలి' సినిమాతో భళ్లాలదేవగా యూనివర్సల్‌ స్టార్‌డమ్‌ వచ్చేసింది రానాకి. దాంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ALSO READ: సెహ్వాగ్ నోట‌.. బాహుబ‌లి మాట‌