ENGLISH

సుధీర్ తో పెళ్ళి పైన క్లారిటీ ఇచ్చిన రష్మి

20 June 2018-19:17 PM

జబర్దస్త్ యాంకర్ రష్మి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో వీలైనంత వరకు టచ్ లోనే ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ ఎవరైనా ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగినా చాలా తెలివిగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.

తాజాగా అలాంటిదే ఒక సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఒక నెటిజెన్ యాంకర్ రష్మిని నేరుగా మీరు సుధీర్ ని పెళ్ళి చేసుకోండి... మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది అని అనేసాడు. దీనికి వెంటనే రష్మి రిప్లై ఇచ్చేసింది- . 

మేము తెరపైన చేసేదంతా కేవలం వినోదం కోసమే తప్ప మరో ఉద్దేశ్యం ఏమి ఉండదు. ప్రేక్షకుల్లో సదరు కార్యక్రమం పైన ఆసక్తి కలిగించడానికి మాత్రమే తాము అలా చేస్తాము అని అంతేతప్ప నిజ జీవితంలో అలా ఉంటాము అని కాదు అని తేల్చేసింది. 

ఇక మేము ఎవరిని పెళ్ళి చేసుకోవాలి అనేది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. ఇందులో ఎవరి సలహాలు మాకు అవసరం లేదు అని ముగించింది. దీనితో ఈ ఇరువురు ప్రేమలో ఉన్నారు అన్న పుకార్లకి మరోసారి చెక్ పెట్టింది రష్మి.  

 

ALSO READ: నా నువ్వే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవుతారు