గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC16 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో చెర్రీ క్రికెటర్ గా కనిపించనున్నట్లు టాక్. చెర్రీకి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీ తరవాత చెర్రీ సుకుమార్ తో ఒక ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. RC17 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీ వర్క్ అప్పుడే మొదలు పెట్టారట సుకుమార్. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేందుకు తన టీమ్ తో కలిసి విదేశాలకి వెళ్లనున్నారు. ఈ లోగా మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.
ఇది వరకే చెర్రీ - సుక్కు కాంబోలో 'రంగస్థలం' వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మళ్ళీ రెండో సారి కలిసి వర్క్ చేస్తున్న వీరిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో చెర్రీ కి జోడీగా రష్మికని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. చెర్రీ, రష్మిక జోడీ బాగుంటుంది అని, ఫ్రెష్ గా ఉంటుందని సుకుమార్ ఆలోచన. రష్మిక సుకుమార్ తో కలిసి పుష్ప, పుష్ప 2 కి వర్క్ చేసింది. ఈ సినిమా విజయంలో శ్రీవల్లి పాత్ర కూడా ఉంది. శ్రీవల్లిగా రష్మిక అద్భుతమైన నటన కనపర్చింది. అందుకే సుకుమార్ మళ్ళీ రష్మికకే ఓటు వేసాడు.
ఇప్పటివరకు సుక్కు వర్క్ చేసిన హీరోయిన్స్ ఎవరితోనూ రెండోసారి వర్క్ చేయలేదు. కానీ రష్మికతో ఇది మూడోసినిమా. రష్మిక కూడా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఏ సినిమాలో నటించినా తన పాత్రకి కూడా ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటోంది. అదే రష్మికకి గుర్తింపు తీసుకు వచ్చింది.