కన్నడ బ్యూటీ రష్మికా మండన్నాకి తిరుగే లేదనిపిస్తోంది. ఇటీవలే 'మీకు అర్ధమవుతోందా.?' అంటూ 'సరిలేరు..'లో డిఫరెంట్ మ్యానరిజమ్‌తో క్యూట్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు 'వాట్ ఏ బ్యూటీ..' అంటూ మరోసారి క్యూట్ అండ్ హాట్ అప్పీల్‌తో వచ్చేస్తోంది. రష్మికా - నితిన్ జంటగా తెరకెక్కుతోన్న 'భీష్మ' చిత్రం నుండి ఓ వీడియో సాంగ్ ప్రోమో వదిలారు. ఈ సాంగ్‌కి రష్మిక అప్పియరెన్స్ హైలైట్‌గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే బుట్టబొమ్మని తలదన్నేలా క్యూట్‌గా ఉంది. అంతేనా, బీభత్సమైన మాస్ డాన్సులతో పిచ్చెక్కిస్తోంది. క్యూట్ క్యూట్ కాస్ట్యూమ్స్‌తో నాటీ నాటీ ఎక్స్‌ప్రెషన్సతో కుర్రకారుకు కిర్రాక్ తెప్పిస్తోంది.
'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ.. అమ్మా నాన్న ఇంట్లో లేరూ..' వంటి లిరిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో రష్మిక వేసిన చిన్న చిన్న డాన్స్ స్టెప్పులు భలేగున్నాయిలే. మొత్తానికి 'సరిలేరు..'లో 'హి ఈజ్ సో క్యూట్..' సాంగ్‌కి మించిన క్రేజ్‌ని ఈ సాంగ్‌తో రష్మిక కొట్టేసేలానే కనిపిస్తోంది. రేపు అనగా ఫిబ్రవరి 2న పూర్తి సాంగ్ ఆడియో రానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: అప్పుడు తమన్నా, ఇప్పుడు రెజీనా!