ENGLISH

'ఛలో' సినిమాకి ఆ బ్యూటీనే హైలైట్‌

18 January 2018-16:28 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'ఛలో'. అందగాడు నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. మన అందగాడికి సరైన జోడీ రష్మికా మండన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. నాగశౌర్య అందంతో పాటు మంచి నటుడు. పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. అలాంటి నాగశౌర్యకి నటనలో సరైన పోటీ ఇచ్చే అమ్మాయి రష్మికా అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎంట్రీకి ముందే కన్నడ సినిమా 'కిరిక్‌ పార్టీ'తో సూపర్‌ పాపులర్‌ అయిపోయిందీ బ్యూటీ. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌తోనే అమ్మడు ఎట్రాక్ట్‌ చేసేస్తోంది. చాలా అందంగా చూపించాడు డైరెక్టర్‌ రష్మికాని ట్రైలర్‌లో. క్యూట్‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా కనిపిస్తోంది. అలాగే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కూడా ఈ ముద్దుగుమ్మ. ఎంత మంది ముద్దుగుమ్మలు వస్తున్నా, తెలుగు సినిమాకి హీరోయిన్స్‌ కొరత అలాగే ఉంది. ఆ కొరతలో కొంత భాగం ఈ ముద్దుగుమ్మ ద్వారా తీరేలానే అనిపిస్తోంది. యాక్టింగ్‌ టాలెంట్‌, బ్యూటీనెస్‌తో పాటు, ఈ ముద్దుగుమ్మలో సరికొత్త ఎట్రాక్షన్‌ ఏదో ఉందనిపిస్తోంది. 

తెలుగు కూడా చక్కగా మాట్లాడేస్తోంది. తొలి సినిమాకే డబ్బింగ్‌ చెప్పేసుకుంది. గ్లామర్‌లో నో అబ్జక్షన్స్‌.. ఇక ఇంత కన్నా ఇంకేం కావాలి తెలుగు తెరపై హీరోయిన్‌గా వెలిగిపోయేందుకు. త్వరలోనే 'ఛలో'తో తన సత్తా చాటేందుకు సిద్ధమైపోతోంది ముద్దుగుమ్మ రష్మికా. ఫీల్‌ గుడ్‌ లవ్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఛలో' ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మండన్న, విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తోంది.

ALSO READ: చరణ్ - బోయపాటి సినిమాకి హీరోయిన్ ఫిక్స్..